HomeINTERNATIONAL NEWSభారత్ బడ్జెట్ లెక్క చూసి భయపడుతున్న చైనా

భారత్ బడ్జెట్ లెక్క చూసి భయపడుతున్న చైనా

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

సంవత్సరానికోసారి దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును అంచనా వేస్తూ చేసే కేటాయింపులు.. లెక్కలు.. పద్దులు.. బడ్జెట్ అంటే ఇవి మాత్రమే. కానీ అదే బడ్జెట్ ను విదేశాంగ విధానంతో రంగరించి సరిహద్దు దేశాలపై అస్త్రంగా కూడా ఉపయోగించుకోవచ్చని భారత్ చాటి చెప్పింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుంచిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లోనే ఉంది అసలు లెక్కంతా. వడ్డింపులు, కేటాయింపులే కాదు.. పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా ప్రవర్తించే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు పనికొచ్చే ఎత్తులు, పైఎత్తులు కూడా ఈ బడ్జెట్ లో పొందు పరిచింది మన కేంద్ర ప్రభుత్వం.
మారిన విదేశాంగ విధానానికి అనుగుణంగా మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో సైతం అంతకుమించిన యాక్షనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం తాజా బడ్జెట్‌లో మిత్ర దేశాలకు చేసిన కేటాయింపులే. తాలిబన్ల రాజ్యం అఫ్ఘనిస్తాన్‌కు కూడా రెండోందల కోట్ల కేటాయింపులు జరిపారు. అయితే, మన బడ్జెట్‌లో ఇతర దేశాలకు కేటాయింపులు జరపడం వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి? సరిహద్దు దేశాలకు ఆర్ధిక సాయంతో.. శత్రుదేశాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు?
శత్రువుకు షాకివ్వాలంటే సరిహద్దుల్లో బుల్లెట్లు పేల్చాల్సిన పనిలేదు. సరిహద్దు దేశాలతో మైత్రిని మిస్సవ్వకుండా ఉన్నా సరిపోతుంది. గతకొంత కాలంగా డ్రాగన్ కంట్రీ చైనా చేస్తోంది ఇదే. కాకపోతే చైనా తన అవసరాల కోసం చిన్న దేశాలను వాడుకుని వదిలేస్తుంది. కానీ, భారత్‌ మాత్రం ఒక్కసారి తనతో దోస్తీ చేస్తే కడవరకూ అండగా నిలుస్తుంది. అంతే తేడా.. భారత్, చైనా విదేశాంగ విధానంలో తేడాల గురించి సింపుల్‌గా స్పష్టంగా చెప్పాలంటే.. శ్రీలంకకు అప్పులిచ్చి హంబన్‌టోట పోర్టును ఆధీనంలోకి తెచ్చుకోవడం, పాకిస్తాన్‌తో ఎకనామిక్ కారిడార్‌ అంటూ భారత్‌పై కుట్రలు చేయడం.. ఇప్పుడు తాలిబన్లతో వ్యాపారం పేరుతో దగ్గర కావడం లాంటివి.. చైనా తీరుకు అద్దం పట్టేవి. అదే భారత్ విషయానికి వస్తే.. పొరుగు దేశాలతో వాణిజ్యం ఉన్నా, లేకున్నా కష్ట కాలంలో అండగా నిలవడం మన నైజం. అదికూడా ఆ దేశాల నుంచి ఏం ఆశించకుండానే. ఇప్పుడు కూడా భారత్ తన బడ్జెట్‌లో పొరుగు దేశాలకు కేటాయింపులు చేసిం ది. కానీ, ఈ కేటాయింపులు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే గతకొంతకాలంగా చైనా దూకుడుకు ఈ కేటాయింపులు కళ్లెం వేస్తాయి.
కేంద్ర బడ్జెట్ 2023లో భారత్ తనతో సఖ్యాతగా ఉన్న మిత్రదేశాలకు కేటాయింపులు చేసింది. భూటాన్‌కు అత్యధికంగా 2వేల 400 కోట్లు.. నేపాల్‌కు 550 కోట్లు.. మారిషస్‌కు 460.79 కోట్లు.. మాల్దీవులకు 400 కోట్లు.. మయన్మార్‌కు 400 కోట్లు.. ఆఫ్రికన్ దేశాలకు 250 కోట్లు.. బంగ్లాదేశ్‌కు 200 కోట్లు.. ఆప్ఘనిస్తాన్‌కు 200 కేటాయిపులు చేసింది. ఆర్థికమాంద్యం కారణంగా ఈ బడ్జెట్లో విదేశాలకు అందించే సాయం ప్యాకేజీని 5వేల 848.58 కోట్లకు తగ్గించాల్సి వచ్చిందని భారత్ ప్రకటించింది. నిజానికి.. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్ర దేశాలకు భారీగానే కేటాయింపులు చేస్తుంది. మన దౌత్య విధానం సైతం మారడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తోంది. దీని వల్ల అడ్వాంటేజ్ భారత్‌కు ఉంటుంది. ఎందుకంటే చైనా మన పొరుగు, మిత్ర దేశాలైన పాకిస్తాన్.. శ్రీలంక.. మయన్మార్.. నేపాల్ వంటి దేశాలకు నగదు సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని జల.. భూ రవాణా మార్గాల్లో పెత్తనం చెలాయిచేందుకు యత్నిస్తోంది. దీంతో భారత్‌‌కు కొంతవరకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి చెక్ పెట్టే ప్రయత్నమే తాజా కేటాయింపులుగా చూడొచ్చు.
నిజానికి.. ఆసియాలో చైనా తర్వాత అతిపెద్ద దేశం ఇండియానే. సరిహద్దు దేశాలతో సఖ్యత ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఆయా దేశాలు సైతం భారత్‌కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉండటంతోపాటు స్వేచ్ఛా వాణిజ్యం సులభం ఔతుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి సంస్కరణలు మరింత సక్సెస్ కావాలంటే పొరుగుదేశాలతో వాణిజ్యం చాలా ఇంపార్టెంట్. చిన్న దేశాలతో వాణిజ్యం విషయంలో కోవిడ్ ముందు వరకూ చైనా ఆదిపత్యమే కొనసాగింది. కరోనా కల్లోలం తర్వాత చైనా వాణిజ్యానికి బ్రేకులుపడ్డాయి. అదే కోవిడ్ టైంలో సరిహద్దు దేశాలకు వ్యాక్సిన్, ఔషధాల సరఫరా లాంటి సాయం చేసిన భారత్ వాటితో భేష్ అనిపించుకుంది. ఫలితంగా అప్పటివరకూ చైనాతో వాణిజ్యానికి అలవాటుపడిన చాలా దేశాలకు భారత్ ఇంకాస్త దగ్గరయింది. ఇలాంటి సమయంలో మన బడ్జెట్‌లో పొరుగు దేశాలకు కేటాయింపులు చేయడం అంటే పరోక్షంగా చైనా వాణిజ్యానికి చెక్ పెట్టడమే.
ప్రధానంగా పొరుగు దేశాలకు తాజా కేటాయింపుల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు 200 కోట్లు కేటాయించడం మోడీ సర్కార్ వ్యూహానికి అద్దం పడుతోంది. ఎందుకంటే ఇటీవల డ్రాగన్ దేశం తాలిబన్లతో దోస్తీకి తహతహ లాడుతోంది. ప్రపంచం మొత్తం తాలిబన్ల పాలనను గుర్తించకపోయినా వారితో వాణిజ్యానికి సిద్ధపడింది. దీని లక్ష్యం ఆఫ్ఘన్‌లో ఉన్న ట్రిలియన్ డాలర్ల చమురు నిక్షేపాలపై కన్నేయడమే. ఆ చమురు నిక్షేపాలు కొల్ల గొట్టేందుకు ఎప్పట్నుంచే డ్రాగన్ ఎదురుచూస్తోంది. చివరకు తాలిబన్లకు సైతం నిధులు అవసరం కావడంతో చైనాతో వాణిజ్యానికి అంగీకరించారు. తాలిబన్లతో వాణిజ్యం చేసుకోడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే తాలిబన్లు పాకిస్తాన్‌‌పై దాడులకు దిగుతున్నారు. భవిష్యత్‌లో పాకిస్తాన్‌ తాలిబన్ల వశమయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. చైనాతో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో తాలిబన్లు పాక్‌ ను ఆక్రమించుకుంటే పరిస్థితులు మనకు ప్రమాదకరంగా మారొచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఆ దిశగా తాలిబన్లను ఉపయోగించుకునే ప్రమాదముంది. నిజానికి.. పాకిస్తాన్‌తో చైనా దోస్తీ చేయడానికి కూడా రీజన్ భారత్‌లో టెర్రర్ అలజడులు సృష్టించడమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ, ప్రస్తుతం పాక్ అన్నిరకాలుగా చేతులెత్తేయడంతో దాన్ని వెంటాడుతున్న తాలిబన్లకు వాంటెడ్‌గా చైనా దగ్గరైందనే విశ్లేషణ వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో తాలిబన్లకు ఏం ఆశించకుండానే భారత్ తన బడ్జెట్‌లో 200 కోట్లు కేటాయించింది. ఈ ప్రకటనపై తాలిబన్లు హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల బంధం బలోపేతం కావడానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఆప్ఘాన్లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను భారత్ తిరిగి పూర్తి చేయాలని తాలిబన్లు కోరారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అప్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత భారత్ ఆ దేశంలో ప్రాజెక్టులను నిలిపివేసింది. నిజానికి.. తాలిబన్లు కోరుతున్నట్టు ఆఫ్ఘన్‌లో నిలిచిపోయిన ప్రాజెక్టులను భారత్ ఇప్పటికిప్పుడు తిరిగి పట్టాలెక్కించక పోవచ్చు. కానీ, అదే తాలిబన్లు గుడ్డిగా చైనా వలలో చిక్కకుండా తాజా బడ్జెట్ కేటాయింపులు వర్క్‌ఔట్ అవుతాయి. ఇదే సమయంలో భారత్‌ విషయంలో పాకిస్తాన్ మళ్లీ తోకజాడించినా తాలిబన్ల సపోర్ట్ మనకు దొరుకుతుంది. అందుకే కేంద్ర బడ్జెట్‌లో విదేశాలకు చేసిన కేటాయింపుల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు చేసిన కేటాయింపు లది ప్రత్యేక స్థానంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌ మాత్రమే కాదు.. భూటాన్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలన్నీ భారత్‌కు ప్రత్యేకమే. ఈ దేశాలకు కేటాయింపులు చేయడం ద్వారా డ్రాగన్ కంట్రీ చైనా మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ కాదు. అందుకే, శత్రువుకు చెక్ పెట్టాలంటే సరిహద్దుల్లో యుద్ధం ఒక్కటే కాదు.. స్నేహం కూడా ఓ మార్గం అవుతుందనేది. ఏదేమైనా పొరుగు దేశాలకు మోడీ సర్కార్‌ చేసిన కేటాయింపులు బీజింగ్‌కు ఓ రకమైన షాకింగ్ మూమెంటనే చెబుతున్నారు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...