ఎంత డబ్బైనా సరే కొనేస్తున్న చైనీస్
చైనాలో కరోనా విలయ తాండవం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పటికే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా చెప్పేసింది. ఈ విషయాన్ని చైనా కాదన్నా.. అదే నిజం. అయితే.. రోజుకు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న భయానక పరిస్థితుల్లో చైనీయులను ప్రాణభయం వెంటాడుతోంది. చైనా మందులు, వ్యాక్సిన్ పై ఏమాత్రం నమ్మకం లేని చైనా జనం.. బ్లాక్ మార్కెట్లో దొరుగుతున్న ఇండియన్ జెనెరిక్ మెడిసిన్ ను కొనేందుకు ఎగబడుతున్నారు. 10 టాబ్లెట్ల బాక్సును వెయ్యి యువాన్లు చెల్లించైనా కొనేస్తున్నారు. చైనాకు చెందిన సెర్చ్ ఇంజన్ వీబోలో ఈ విషయం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
చైనాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన పాక్స్లోవిడ్ మరియు అజ్వుడైన్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ చైనాలో తయారైన బ్రాండెండ్ మందులకన్నా భారత్ లో తయారైన జెనెరిక్ మందుల వైపే చైనా జనం మొగ్గు చూపుతున్నారు. చైనా బ్రాండెండ్ మందులు వాడినా మళ్ళీ మళ్ళీ కరోనా బారిన పడటం.. ఒక్క సారిగా ప్రాణాల మీదకు వచ్చి మృత్యువాత పడటంతో చైనా జనం భారత జనరిక్ మందుల వైపు ఎగబడుతున్నారు. కానీ చైనా మీడియా ఈ విషయాన్ని బయటకు రానివ్వటం లేదు. భారత్ కు చెందిన మందులు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే ఏకంగా మరణ శిక్ష విధిస్తోంది చైనా ప్రభుత్వం.