HomeINTERNATIONAL NEWSఆర్మీకి ఐరన్ మ్యాన్ సూట్లు & డెడ్లీ రోబోలు

ఆర్మీకి ఐరన్ మ్యాన్ సూట్లు & డెడ్లీ రోబోలు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

మారుతున్న కాలంతోపాటే మనమూ మారాలి. లేదంటే వెనుకబడిపోతాం. అలాంటిది ఓ దేశానికి రక్షణ కల్పించడంలో ఇంకెంత అప్టేడ్ అవ్వాలి? అప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆ తరహా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో సింగిల్ బుల్లెట్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు శత్రుభీకర మిస్సైళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ మార్పంతా మన కళ్లముందు జరిగిందే. అయితే, ఇప్పుడు ఆ మార్పును నెక్స్ట్ లెవెల్‌కు చేర్చేందుకు సిద్ధమైంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు అండగా ఉండేలా, ఎనిమీ దాడులను క్షణాల్లో తిప్పికొట్టేలా అధునాతన ఆయుధాలు, పరికరాలను సమకూర్చుకుంటోంది.

ఇందులో భాగంగానే డ్రోన్లు, జెట్‌ ప్యాక్‌ సూట్లు, రోబోటిక్ మ్యూల్స్‌ను కొనేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, ఇవి రష్యా నుంచో మరో దేశం నుంచో దిగుమతి చేసుకోవట్లేదు. మన దేశానికి చెందిన కంపెనీ నుంచే తయారు చేయిస్తోంది. అందుకే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హైటెక్‌గా మారుతోంది.

సరిహద్దుల్లో సైనికుల కోసం 130 డ్రోన్ సిస్టమ్స్, 48 ఐరన్ మ్యాన్ శైలి జెట్‌ ప్యాక్‌ సూట్లు, 100 రోబోటిక్ మ్యూల్స్‌ను అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆదేశాలు ఇచ్చింది. ఆర్మీ సిద్ధం చేస్తున్న వాటిలో ఫస్ట్ ప్లేస్ జెట్ ప్యాక్ సూట్లదే. జెట్ ప్యాక్ సూట్ అనేది సైనికుడు గాల్లో ఎగరడానికి ఉపయోగించే పరికరం. సింపుల్‌గా చెప్పాలంటే ఐరన్ మ్యాన్‌లో కనిపించే సూట్ అన్నమాట. ఇది సాధారణంగా జెట్ ఇంజన్‌లతో కూడిన బ్యాక్‌ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సుమారు 3 వేల మీటర్ల ఎత్తువరకు పర్వతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాలలో జెట్‌ప్యాక్‌లు పనిచేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిని ధరించడం ద్వారా ఎలాంటి రోడ్డు, రైలు మార్గాలు లేని కఠినమై ప్రాంతాలకు భారత సైనికులు వెళ్లే వీలుంటుంది. శత్రువుపై దాడి చేసేందుకు వేగంగా కదలడానికి సైతం ఈ సూట్లు సహాయపడతాయని మిలటరీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. భారత్, చైనా సరిహద్దుల్లోని లఢఖ్‌ లాంటి కఠినమైన ప్రాంతాల్లో నిఘా పెట్టే సైనికులకు జెట్ ప్యాక్ సూట్లు ఓ వరంగానే భావించొచ్చు. అక్కడి కఠిన వాతావరణంలో ఎమర్జెన్సీ సేవలందించేందుకు ఈ అడ్వాన్స్‌డ్ సూట్లు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.


సాధారణంగా.. ఒక రోబోటిక్ మ్యూల్ 60 కిలోల వరకూ బరువుంటుంది. సైన్యంలో శిక్షణ పొందిన మ్యూల్స్ 72 కిలోల వరకు మోస్తాయని ఆర్మీ చెబుతోంది. అంతేకాదు, విశ్రాంతి లేకుండా 26 కిలోమీటర్లు పరుగెత్తగలవని తెలుస్తోంది. రోబోటిక్ మ్యూల్ వేగం చాలా ఎక్కువ. అందుకే యుద్ధ సమయాల్లో సేనలకు చిన్నపాటి ఆయుధాలు అత్యవసరంగా చేరవేయడంలో ఇవి ఉపయోగపడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, రష్యా యుద్ధమే. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధంలో వేలమంది రష్యన్ సేనలు టైంకి ఆహారం, ఔషధాలు అందకే చనిపోయినట్టు నివేదికలు వచ్చాయి. ఏ దేశ సైన్యానికైనా యుద్ధంలో ఆహారం, ఔషధాలు కీలకం. అవి అందకుంటే ఎనిమీ దాడికంటే ముందే మరణానికి వెల్‌కమ్ చెప్పాల్సి ఉంటుంది. లఢఖ్ లాంటి కఠినమైన సరిహద్దు ప్రాంతాలు ఉన్న భారత్‌కు ఇవి ఇంకాస్త ఎక్కువగానే అవసరం. ఇందుకే ఇండియన్ ఆర్మీ సైతం ఈ రోబోటిక్ మ్యూల్స్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదట 100 మ్యూల్స్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించబోతోంది.


నిజానికి.. కఠినమైన మన సరిహద్దుల్లో పహారా కాస్తున్న సేనలకు ఆహారం, ఔషధాలు, ఆయుధాల వంటివాటిని ఇప్పటికీ గాడిదల ద్వారానే తరలిస్తున్నారు. దీనికి సమయంతోపాటు సహనం కూడా అవసరం. ఫలితంగా ఎమర్జెన్సీ సమయాల్లో సైనికులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు రోబోటిక్ మ్యూల్స్‌ను రంగంలోకి దించడానికి సిద్ధం కావడంతో ప్రతికూల ప్రాంతాల్లో ఉండే సైనికుల కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇదే సమయంలో శత్రువుకంటే ఓ అడుగు ముందే ఉండడానికి కూడా ఈ పరిణామం హెల్ప్ అవుతోంది. ఈ రెండింటితో పాటూ అత్యాధునిక డ్రోన్‌ సిస్టమ్‌లను సైతం సిద్ధం చేస్తోంది. ఇవన్నీ త్వరలోనే సరిహద్దుల్లో సేనలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు బోర్డర్‌లో సైనికులను మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...