HomeINTERNATIONAL NEWSఇండియన్ ఆర్మీ చేతికి డేంజరస్ డ్రోన్లు

ఇండియన్ ఆర్మీ చేతికి డేంజరస్ డ్రోన్లు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

యుద్ధం అంటే అందరికీ గుర్తొచ్చేవి విమానాలు, నౌకలు, ట్యాంకులే. కానీ, ఇప్పుడున్న పరిస్థితు ల్లో ఇవి మాత్రమే ఉంటే సరిపోదు. అత్యాధునిక డ్రోన్లు కూడా ఉండి తీరాల్సిందే. ఈ విషయంలో ప్రపంచంతో పాటే భారత్ కూడా అప్డేట్ అవుతోంది. ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పాలంటే అగ్రరాజ్యాలకంటే భారత్ ఓ అడుగు ముందే ఉంది. అమెరికా ప్రిడేటర్ డ్రోన్లకు ఏమాత్రం తీసిపోని డెడ్లీ డ్రోన్లకు ఇప్పుడు ఇండియా కేరాఫ్ అడ్రస్. తాజాగా రెండు శత్రుభీకర డ్రోన్లు ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ డ్రోన్లలో మొదటిది తపస్ అయితే.. రెండోది ఘాతక్.
గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ భారత్‌ను డ్రోన్ల హబ్‌గా మార్చాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఎందుకంటే భవిష్యత్ యుద్ధాల్లో ఎలాంటి శత్రుభీకర ఆయుధానికైనా స్థానందక్కేది ఈ డెడ్లీ డ్రోన్ల తర్వాతే. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో అత్యాధునిక యూఏవీలు ఆధిపత్యం చెలాయించబోతున్నాయి. అందుకే, యుద్ధ భూమిలో శత్రువు రాడార్‌కు చిక్కని కంత్రీ డ్రోన్లను అభివృద్ధి చేసే దేశంపై డాలర్ల వర్షం కురుస్తుంది. దీనితోపాటు మన చిరకాల ఎనిమీలు కూడా సరిహద్దుల్లో తోకజాడిస్తే వీటితోనే అంతుచూడచ్చు. అందుకే, మోడీ సర్కార్ ఇండియాను ప్రపంచ డ్రోన్ల హబ్‌గా నిలపాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగానే డీఆర్డీవో ఎప్పట్నుంచో వీటి అభివృద్ధిపై కృషి చేస్తోంది. ఇప్పటికే పలు రకాల డ్రోన్లు ఆర్మీ చేతికి అందించింది కూడా. తాజాగా శత్రు భీకర తపస్‌ను ఆర్మీ చేతికి అందించేందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. అన్నీకుదిరితే మరో వారంలోనే తపస్ ఆర్మీకి అందుతుంది.. దీని తర్వాత ఘాతక్‌ అనే మరో డెడ్లీ డ్రోన్‌ కూడా అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
నిజానికి.. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమీకరిస్తోంది. ఫైటర్ జెట్‌లు, యుద్ధ నౌకలు దేశీయంగా తయారు చేసుకుంటూ అగ్రరాజ్యాలకు కూడా భారత్ సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే కొత్త డ్రోన్‌లనూ తయారు చేసింది. మానవ రహిత వెహికిళ్లను వచ్చే వారం నుంచి రక్షణ రంగంలోకి దింపనున్నారు. త్వరలో బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్‌లోనే తపస్ డ్రోన్‌లు గాల్లో విన్యాసాలు చేయనున్నాయి. ఈ డ్రోన్‌లను డీఆర్డీవో తయారు చేసింది. ఈ డ్రోన్‌తో పాటు దాదాపు 180 ఎయిర్ క్రాఫ్ట్‌లు నింగిలో ఎగర నున్నాయి. ఐతే.. ఈ కార్యక్రమంలో డ్రోన్ షో హైలైట్ అవుతుందని చెబుతున్నారు అధికారులు. తపస్ అంటే టాక్టికల్ ఎయిర్‌బోర్చ ప్లాట్‌ఫార్మ్‌ ఫర్ ఏరియల్ సర్వేలెన్స్.. ఇది కేవలం నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు శత్రువులపై దాడి చేసేందుకూ సిద్ధంగా ఉంటుంది. 2016 నుంచి వీటి తయారీ మొదలైంది. అయితే.. ఇప్పటి వరకూ వీటిని ఇండియన్ ఆర్మీలో చేర్చలేదు. బెంగళూరు ఈవెంట్ తరవాత ఈ డ్రోన్‌లను ఇండియన్ ఆర్మీలో చేర్చనున్నారు.
ఇక తపస్ ఫీచర్ల విషయానికొస్తే.. 28 వేల అడుగుల ఎత్తులో 18 గంటలకు పైగా చక్కర్లు కొట్టగలిగే సామర్థ్యం ఈ డేంజరస్ డ్రోన్‌కు ఉంది. గతేడాది పరీక్షల్లో 18 గంటలు ఏకధాటిగా ప్రయాణించినట్టు డీఆర్డీవో తెలిపింది. ఇది మీడియమ్ ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్. టేకాఫ్, ల్యాండింగ్ అంతా మానవ రహితంగానే జరుగుతాయి. గతంలో ఈ డ్రోన్‌ రుస్తుమ్-2గా వ్యవహరించేవారు. అయితే మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇప్పుడు తపస్ పేరుతో మరింత పవర్‌ఫుల్‌గా తయారు చేశారు. ఏకధాటిన వెయ్యి కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలగడం తపస్‌ ప్రత్యేకతల్లో హైలైట్. పగలు మాత్రమే కాదు… రాత్రి వేళల్లో కూడా నిఘా పెడుతుంది తపస్ డ్రోన్. నిఘా పెట్టడంతోపాటు అవసరమైతే దాడులు కూడా చేయడం తపస్ స్పెషల్. అందుకే దీన్ని ఇండియన్ ప్రిడేటర్‌గా పిలుస్తున్నారు. మధ్యశ్రేణి ఎలక్ట్రిక్‌ ఆప్టిక్‌, దీర్ఘశ్రేణి ఎలక్ట్రిక్‌ ఆప్టిక్‌, సింథటిక్‌ అపాచర్‌ రాడార్‌, ఎలక్ట్రానిక్‌-కమ్యూనికేషన్‌ ఇంటెలిజెన్స్‌ పరికరాలు తీసుకెళ్లగలదు. ఒక్క సారి తపస్ ఆర్మీలోకి ఎంట్రీ ఇస్తే.. శత్రుదేశాలు వణకడం ఖాయం. వచ్చే వారంలోనే తపస్ ఎంట్రీకి ముహూర్తం ఖాయమైంది.
మరోవైపు.. తపస్‌తో పాటు ఆర్మీ అమ్ములపొదిలో చేరేందుకు మరో డెడ్లీ డ్రోన్ ఘాతక్‌ కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్, జులై నాటికి ఈ డేంజరస్ డ్రోన్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌ 2009లోనే పట్టాలెక్కగా ఆ సమయంలో ఘాతక్‌ను అటానమస్ అన్‌మ్యాన్డ్ రీసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పిలిచే వారు. 2015లో ఘాతక్‌గా పేరు మార్చారు. ఇక గతేడాది కర్ణాటకలోని చిత్ర దుర్గ దగ్గర ఘాతక్‌ డ్కోన్‌‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ డెడ్లీ డ్రోన్ 30వేల అడుగులలో ఎగురగలదు, దీనితో క్షిపణులను, ఇతర బాంబర్లను ప్రయోగించవచ్చు. 190 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. 4 మీటర్లపొడవు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి 200 కిలోమీటర్ల నుండి కూడా ఆదేశాలు ఇవ్వవచ్చు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగించిన టర్కిష్‌ డ్రోన్‌కు ఇది ఏమాత్రం తీసిపోదని మిలటరీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో క్షిపణులను సైతం ప్రయోగించే వీలుండడంతో వరల్డ్‌లోనే శత్రుభీకర డ్రోన్‌గా ఘాతక్‌ నిలవనున్నట్టు చెబుతున్నారు. నిజానికి.. 2024-25 మధ్య కాలంలోనే ఇది అందుబాటులోకి వస్తుందని డీఆర్డీవో ప్రకటించినా.. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. వీలైనంత త్వరగా ఘాతక్‌ను ఆర్మీకి అందివ్వాలనుకుంటున్నారు.
మరోవైపు.. 2030 నాటికి భారత్‌ను డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని మోడీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికోసం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన కోసం ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తోంది. అయితే, అదేమంత ఈజీ కాదు. ఇందుకోసం ఎక్కువగా అటాకింగ్ డ్రోన్లపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే, అమెరికా ప్రిడేటర్, రీపర్ డ్రోన్‌ల తరహాలో దూకుడుగా దాడి చేసే డ్రోన్‌లను తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇదే సమయంలో అమెరికా నుంచి ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌కు చెందిన 20 స్కై గార్డియన్, 10 సీ గార్డియన్ వెర్షన్‌లను కొనేందుకు కూడా మోడీ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 22 వేల కోట్లు కేటాయించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైడ్రోన్ హెరాన్‌‌పై ఆయుధాలను మోహరించే ప్రక్రియను కూడా భారత్ ప్రారంభించబోతోంది. దాదాపు 2వేల 975 కోట్ల వ్యయంతో భారత్‌తో సంయుక్త ప్రాజెక్టులో ఇజ్రాయెల్ ఈ డ్రోన్‌లపై లేజర్-గైడెడ్ బాంబులను, గాలి నుండి ఉపరితల క్షిపణులను మోహరిస్తుంది. ఇవి కాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా అమర్చనున్నారు.
మొత్తంగా.. అత్యాధునిక అటాకింగ్ డ్రోన్ల కేరాఫ్ అడ్రస్‌గా ఇండియా మారడానికి పెద్దగా టైం పట్టే అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో ఇండియా కింగ్ మేకర్‌గా మారబోతున్నట్టే. ఏదేమైనప్పటికీ.. తూటాలను దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి అత్యాధునిక ఆయుధాల ఎగుమతి స్థాయికి ఇండియా చేరడం గర్వించదగ్గ అంశం.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...