రాయపూర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ ను కేవలం 108 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 109 పరుగుల టార్గెట్ ను కేవలం 20.1 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ వచ్చీ రావటంతోనే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 50 బాల్స్ లో 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. 51 రన్స్ చేసి అవుటైన రోహిత్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో భారత్ విజయాన్ని సునాయాసం చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ 11 పరుగులకే స్టంపౌట్ గా వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
రాంచీలో జరిగిన ఫస్ట్ వన్డేలో 349 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేని న్యూజీలాండ్.. చివరి దాకా పోరాడి.. 337 పరుగులు చేసినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. 3 వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లను వరుసగా గెలిచిన టీమిండియా.. సిరీస్ ను కైవసం చేసుకుంది. ఫస్ట్ వన్డేలో శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే జనవరి 24న ఇండోర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్టు అవుతుంది.