HomeINTERNATIONAL NEWSఅతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ : అమెరికా, చైనా కూడా మన తర్వాతే !

అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ : అమెరికా, చైనా కూడా మన తర్వాతే !

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

మరో 10 నుంచి 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక శక్తిగా భారత్. ఈ గుడ్ న్యూస్ చెప్పింది సాధారణమైన వ్యక్తి కాదు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా మాట్లాడిన మార్టిన్ వోల్ఫ్. భారతదేశ ఆర్థిక వృద్ధి అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఈయన చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్.
చాలా కాలంగా భారత ఆర్ధిక గమనాన్ని పరిశీలిస్తున్నాననీ, ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపారం, ఇతర రంగాల బిజినెస్‌లో లేని వారు భారతదేశం ఆర్థిక వృద్ధిని అంచనా వేయలేరని చెబుతూనే.. రాబోయే 10-20 సంవత్సరాలలో ఖచ్చితంగా ఆర్థికంగా అగ్రదేశాల లిస్ట్‌లో చేరుతుందని మార్టిన్ క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు. ఇదే సమయంలో.. గతేడాది డిసెంబరులో ప్రపంచ బ్యాంక్ భారతదేశ 2022-23 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుండి 6.9 శాతానికి సవరించింది. ఇక ఆర్ధిక సంవత్సరం 21-22లో భారత వృద్ధిరేటు 8.7 శాతానికి అంచనా వేశారు. ‘భారతదేశం 10 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మరింత నిలకడగా ఉంది. గత 10 సంవత్సరాలుగా తీసుకున్న అన్ని చర్యలు భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారడంలో సహాయపడుతుందని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ సైతం తెలిపారు.

చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ ఓల్ఫ్ లెక్కలిలా ఉంటే.. భారత్‌ 2023లో 3.7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనిఆర్‌బీఐ ఆర్టికల్‌ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్‌బీఐ ప్రచురించిన జనవరి బులిటన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది. అలాగే ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం.. 2025 నాల్గవ స్థానానికి, 2027లో 5.4 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానానికీ చేరుకుంటుందని తెలిపింది. ఈ అంచనాలన్నీ ఆర్ధిక మాంద్యం ముప్పు తరుముకొస్తున్న వేళ వేసినవే. అంటే, ప్రపంచం మొత్తాన్నీ ఇబ్బందిపెడుతుందని భావిస్తున్న మాంద్యం దెబ్బ భారత్‌పై అంతగా ఉండకపోవచ్చన్న మాట. అయితే, దీనికి కారణాలేంటి? అమెరికా, చైనా లాంటి దేశాలకే తప్పని ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి భారత్ ఎలా బయటపడబోతోంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ వాటన్నిం టికీ సమాధానాలు కూడా ఉన్నాయి.

నిజానికి.. అగ్రరాజ్యాల డౌన్‌ఫాల్‌కు కారణం వాటి సొంత నిర్ణయాలు, స్వయం తప్పిదాలే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందులో అమెరికాకు కూడా మినహాయింపేం లేదు. ఓవైపు కోవిడ్ ఎఫెక్ట్.. ఇంకోవైపు ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ప్రపంచ చమురు ధరల పెంపుదలతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా దెబ్బతింటోంది. ఈ కల్లోలానికి సంకేతంగా డిసెంబర్‌లో అమెరికా నిరుద్యోగుల సంఖ్య 50 సంవత్సరాల కనిష్టానికి పెరిగింది. అమెరికాకు ద్రవ్యోల్బణం ఒక మొండి సవాలుగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ పరిస్తితి అర్థం చేసుకున్నారు. కొత్త ఉద్యోగ నివేదిక విడుదల సందర్భంగా అమెరికన్ కుటుంబాలకు జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఇంకా చేయాల్సింది చాలానే ఉందని, ఉన్నదంతా కష్ట కాలమే అనే సంకేతాలు ఇచ్చారు. గత నవంబర్లో ముగిసిన 12 నెలల కాలానికి ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉంది. అలాగే, ఆ దేశ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి.

ఈ పెంపుదల లక్ష్యం క్రెడిట్‌ను ఖరీదైనదిగా చేయడం ద్వారా వ్యయాన్ని అరికట్టడం. కానీ, దీని ఫలితంగా ఉత్పత్తిని పరిమితం చేసే వీలుంది. వినియోగదారులు కొనుగోలు చేయకపోతే కంపెనీల నుంచి విక్రయాలు జరగవు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మాంద్యంవైపు వెళుతుంది. ఇవి పూర్తిగా అమెరికా చేసిన సొంత తప్పిదాలే అంటున్నారు ప్రపంచ ఆర్ధిక వేత్తలు.
అమెరికా పరిస్థితి ఇలా ఉంటే.. ప్రపంచ ఆర్ధికంలో రెండో స్థానంలో ఉన్న చైనా సైతం సొంత తప్పిదాలతోనే మాంద్యం ముప్పు కొని తెచ్చుకుంటోంది. నిజానికి.. మూడు దశాబ్దాలపాటు దూసుకెళ్ళిన చైనా అభివృద్ధికి ఇటీవలే స్పీడ్‌ బ్రేకర్లు పడ్డాయి. కరోనా కట్టడికి అనుసరించిన జీరో కొవిడ్‌ విధానమే డ్రాగన్ కొంపముంచేసింది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక ప్రగతికి చైనా అభివృద్ధి కీలకం అన్న అభిప్రాయాలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు డ్రాగన్‌ మందగమనం ఆల్మోస్ట్ అన్ని దేశాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వం పొందిన తర్వాత చైనా అభివృద్ధి పరుగులు మొదలయ్యాయి. మిగతా ప్రపంచంతో వాణిజ్యం చేయడంలో డ్రాగన్ రూపురేఖలే మారిపోయాయి. వస్తు ఉత్పత్తి, తయారీ రంగాల్లో జెట్ స్పీడ్‌తో కేవలం ఇరవై ఏళ్లలోనే చైనా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయింది. యాపిల్‌, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు చైనా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. 2001-2021 మధ్యకాలంలో ఆ దేశ ఎగుమతులు నాలుగింతలు అయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో ఆ దేశ వాటా 4 నుంచి 15శాతానికి చేరింది. అదే సమయంలో అమెరికా వాటా 12 నుంచి 8 శాతానికి పడిపోయింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే చైనా అమెరికాను అధిగమించి ప్రపంచ వర్తక కేంద్రంగా మారడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాలన్నింటికీ కరోనా రివర్స్ చేసేసింది.

చైనాను చిక్కుల్లో పడేసింది ముమ్మాటికీ జిన్‌పింగ్ అనుసరించిన జీరో కోవిడ్ విధానమే.
తయారీ రంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన షాంఘై, బీజింగ్, షెన్‌జెన్ సహా 20కి పైగా నగరాల్లో 2019 నుంచీ లాక్‌డౌన్ అమలు చేస్తూ వచ్చారు. ఫలితంగా తయారీ రంగానికి బ్రేకులు పడ్డాయి. దాంతో నిరుద్యోగ రేటు రికార్డ్ స్థాయిలో 19.9 శాతానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే యువాన్‌ విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వీటికి తోడు తైవాన్‌ విషయంలో అమెరికాతో వివాదం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం డ్రాగన్‌ పరిస్థితిని మరింత కిందికి లాగేశాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ తదితర సంస్థలు చైనా జీడీపీ, ఆర్థికవృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించాయి. చైనా వృద్ధిరేటు 2022లో 4.4శాతంగా ఉంటుందని కొత్త సంవత్సరం ముందురోజు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని కొట్టిపారేసిన ప్రపంచ ఆర్థికవేత్తలు డ్రాగన్‌ వృద్ధిరేటు 2.7శాతం నుంచి 3.3శాతం మధ్యే ఉంటుందని తేల్చేశారు. ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా సైతం చైనా వృద్ధిరేటు 3.5శాతానికి పరిమితం అవుతుందన్నారు. ఆ ప్రభావం వల్ల ప్రపంచంలోని మూడో వంతు దేశాలు మాంద్యం ఛాయల్లోకి వెళ్తాయని హెచ్చరించారు.

నిజానికి.. డ్రాగన్ కష్టాలు ప్రపంచ దేశాలన్నింటినీ తాకుతున్నాయి. ఈ పరిస్థితి భారత్‌కు సవాల్ విసరడంతో పాటు.. పాజిటివ్ అంశాలను కూడా తెచ్చిపెట్టింది. 2020-21 నాటికి చైనా నుంచి మన దిగుమతులు 10.7 నుంచి 16.6శాతానికి పెరిగాయి. ఎగుమతులు 6.4 నుంచి 7.2శాతం వరకు పుంజుకున్నాయి. రసాయనాలు, ఖనిజ ఇంధనాల్లాంటివి చైనాకు ఎగుమతి చేస్తూ.. ఎలక్ట్రికల్ పరికరాలు వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం.అయితే, చైనాలో ఈ ఉత్పత్తుల తయారీ నిలిచిపోవడంతో భారత్‌కు కొత్త ఇబ్బందులొచ్చాయి. దీన్ని అధిగమించేందుకు మేకిన్ ఇండియా ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించడం పెరిగింది. ఇదిలాగే కొనసాగితే భారత్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. భారత ఆర్థిక ప్రగతి భేషుగ్గా ఉండటం ఇందుకు కలిసివచ్చే అంశం. భారత్‌ 7.5శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలోనే రెండో గరిష్ఠ వేగాన్ని అందుకొందంటూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు కితాబిస్తున్నాయి. గతేడాది మన ఎగుమతులు నిర్దేశిత లక్ష్యాన్ని దాటి 50లక్షల కోట్ల మార్క్‌కు రీచ్ అయ్యాయి. అంటే, చైనా కుంగుబాటు భారత్‌కు ఆశించినదానికంటే ఎక్కువగానే కలిసొస్తోందన్న మాట. తాజాగా దావోస్‌లో చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ వోల్ఫ్‌ సైతం ఇవే అంచనాలు వేశారు.

మరోవైపు.. అగ్రరాజ్యాల డౌన్‌ఫాల్ రాజకీయపరంగానూ భారత్‌ పరపతిని పెరుగుతోంది. పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు కొన్నేళ్లుగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలు చైనా సాయం కోసం ఎదురుచూసినా డ్రాగన్ చేయి విదల్చలేదు. కానీ, భారత్ మాత్రం పొరుగుదేశాలకు కష్టకాలంలో అండగా నిలిచింది. గతేడాది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ 3.8 బిలియన్‌ డాలర్ల సాయం అందించి పెద్ద మనసు చాటుకొంది. తాజాగా మరోసారి లంకకు అప్పివ్వాల్సిందిగా ఐఎంఎఫ్‌కు లేఖ రాసింది. అంతేకాదు, తాజాగా శ్రీలంకను సందర్శించిన జైశంకర్ సైతం లంక ఆర్ధిక ప్రగతికి భరోసా ఇచ్చారు. అలాగే, భారత్‌కు సహజ మిత్రురాలిగా భావించే నేపాల్‌ కొంతకాలం కిందట చైనా పంచన చేరింది. అయినా ఆపదలో ఉన్న నేపాల్‌ను డ్రాగన్‌ పక్కన పెట్టింది. ఇదే సమయంలో… భారత్‌ నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టీకరణకు పెద్దమనసుతో స్నేహహస్తం అందించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. రోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ను ఇండియా పెద్దన్నలా ఆదుకొంది. షేక్‌ హసీనా ప్రభుత్వం వచ్చాక భద్రత, రక్షణ, వర్తకం, విద్యుత్తు, రవాణాతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాధినేతలు కృషి చేస్తున్నారు. ఈ చర్యలన్నీ ఆసియాలో బలీయమవడానికి భారత్‌ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే.

నిజానికి.. చైనా ఆర్థిక మందగమనం కారణంగా రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత క్షీణించే వీలుంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఇది సానుకూల అంశమే. ఇక భారత్‌లో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. ప్రపంచస్థాయి వైద్య వసతులు ఉన్నాయి. ఈ-కామర్స్‌ దూకుడుగా విస్తరిస్తోంది. సుశిక్షిత మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికీ మించి జనాభాలో అధిక శాతం యువతే. ఇన్ని సానుకూలతలతో భారత్‌ ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు రంగం సిద్ధమవుతోందని హాంకాంగ్‌ పోస్ట్‌ ఇటీవలే ఓ సంచలన కథనం ప్రచురించింది. డ్రాగన్‌ ఆధిపత్యాన్ని సహించని పాశ్చాత్య దేశాలు దిగుమతుల కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి ఇండియా వైపు చూస్తున్నాయి. వీటన్నింటినీ అనుకూలంగా మలచుకొని ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశం భారత్‌ ఎదుటే ఉంది. ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం లాంటి వేదికలపై ఆర్ధిక వేత్తల అంచనాలన్నీ ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఒక్కమాటలో వచ్చే పదేళ్ల కాలంలో తయారీ రంగంలో వచ్చే మార్పులే భారత్‌ను ఏ స్థానంలో నిలపాలో డిసైడ్ చేస్తాయన్న మాట.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...