తైవాన్ తమలో అంతర్భాగం అంటూ వాదిస్తూ.. సమయం చూసి తైవాన్ ను ఆక్రమించి తమలో కలుపుకోవాలని గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్న చైనాకు.. థింక్ టాంక్ అనే మాగజైన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక వేళ చైనా కనుక తైవాన్ ను ఆక్రమించాలని ప్రయత్నించి యుద్ధానికి దిగితే జరిగేది ఏమిటో అంచనా వేసి ప్రచురించింది. చైనాకు కొన్ని వేల మంది సైనికుల ప్రాణ నష్టంతో పాటు కనీసం 150 ఫైటర్ విమానాలు కాలిపోవటం.. ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలి చైనా ఆర్థిక వ్యవస్థ వినాశనం దిశగా వెళ్తుందనీ.. మళ్ళీ చైనా కోలుకోవాలంటే కొన్ని దశాబ్ధాలు పట్టొచ్చనీ చెప్తోంది థింక్ టాంక్. తైవాన్ కు కూడా నష్టం తప్పదనీ.. కాకపోతే చిన్న దేశం తైవాన్ ను ఆదుకునేందుకు అమెరికా భారత్ లాంటి దేశాలు ముందుకొస్తాయనీ.. దీని వల్ల తైవాన్ యధాస్థితికి చేరుకోటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనీ చెప్పింది.
చైనా గనుక యుద్ధం దిశగా ఆలోచన చేస్తే అది మిగితా ప్రపంచానికి కూడా తీవ్ర నష్టాలపాలు చేస్తుందని థింక్ టాంక్ పేర్కొంది. ఇదంతా పక్కన పెడితే.. చైనా బెదిరిస్తుందే తప్ప యుద్ధం చేసేంత ధైర్యం చైనాకు అస్సలు లేదని అంతర్జాతీయ విశ్లేషకుల భావన. శక్తివంతమైన ఆయుధాలున్నాయనీ.. యుద్ధం భయానకంగా ఉండబోతోందనీ బెదిరింపులకు దిగటం తప్ప.. యుద్ధాన్ని తట్టుకునే స్థితిలో చైనా లేదని వారి అభిప్రాయం. భారత్ పై కూడా చైనా ఇదే చేస్తోంది. తరచూ సరిహద్దుల్లో చైనా ఆర్మీ ముందుకు రావటం.. ఇండియన్ ఆర్మీ చేతుల్లో చావుదెబ్బలు తిని వెను దిరగటం తప్ప యుద్ధం చేయదు.