పంచులకు కౌంటర్లకు కేరాఫ్ అడ్రస్ లాంటి హైపర్ ఆది.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన సభల్లో కూడా దర్శనమిస్తున్నాడు. పవన్ అన్నా.. మెగా ఫ్యామిలీ అన్న వీరాభిమానం చూపించే ఆది.. ఎన్నికల సమయంలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ సారి కూడా పవన్ సభల్లో పాల్గొంటూ జనసేనకు ఓట్లు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఈ రోజు శ్రీకాకుళంలో జరిగిన జనసేన యువశక్తి బహిరంగ సభలో పాల్గొన్న హైపర్ ఆది.. పంచులు ప్రాసలతో ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కాకుండా.. పవన్ పట్ల తన ప్రేమను అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు.
బహిరంగ సభలో మాట్లాడిన ఆది.. శ్రీకాకుళం ప్రాంతం వారికి కుల పిచ్చి లేదనీ.. ఇంతకు ముందే ఓ వ్యక్తిని మీది ఏ కులం అని అడిగితే శ్రీకాకుళం అని సమాధానం చెప్పాడనీ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. వచ్చే సారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేసిన ఆది.. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టు.. పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు.. అంటూ చేసిన కామెంట్లకు యువత ఫిదా అయిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా జనసేన తరఫున ఆది యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొంటున్నాడు.