ఉక్రెయిన్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హెలీకాప్టర్ కూలి అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో పాటు మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. కీవ్ నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన.. ప్రజలు నివసించే ఇళ్ళ మధ్య ఓ నర్సరీ పాఠశాల ముందు జరిగినట్టు కీవ్ గవర్నర్ వెల్లడించారు. ఈ ఘటనతో ఉక్రెయిన్ లో తీవ్ర అలజడి చెలరేగింది. ఉక్రెయిన్ లో ఏం జరుగుతోందో గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటూ జర్మనీ సహా పలు దేశాలు ఆరా తీస్తున్నాయి.
అయితే.. జరిగింది ప్రమాదమా.. లేక రష్యాన్ దళాలు దాడి చేశాయా అన్నది తెలియాల్సి ఉంది. కేంద్ర మంత్రితో పాటు హైలెవల్ అధికారులు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కూలిపోవటం ప్రమాదం కాదనీ.. రష్యన్ దళాల పనే అయి ఉంటుందనీ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే.. ఉక్రెయిన్ మాత్రం దీనిపై స్పష్టమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని చెప్తోంది.