HomeNATIONAL NEWSటాక్ ఆఫ్ ది వరల్డ్ : గ్యాంగ్ స్టర్ కు 1310 సంవత్సరాల జైలు శిక్ష

టాక్ ఆఫ్ ది వరల్డ్ : గ్యాంగ్ స్టర్ కు 1310 సంవత్సరాల జైలు శిక్ష

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఎల్ సాల్వెడార్.. ఈ లాటిన్ అమెరికా దేశం క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్. 65 లక్షల జనాభా, వేలల్లో జరిగే క్రైమ్స్, లక్షల సంఖ్యలో క్రిమినల్స్. చీకటిపడిందంటే కత్తులు నెత్తురు చిందిస్తాయి. తుపాకులు అమాయకుల ప్రాణాలు తీసేస్తాయి. సిల్లీ రీజన్లతో సీరియస్‌గా మర్డర్లు జరుగుతాయి. సింపుల్‌గా చెప్పాల్సి వస్తే.. భూమ్మీద ప్రత్యక్ష నరకం చూడాలని ఎవరైనా ఆశపడితే ఎల్ సాల్వెడార్‌కు వెళితే సరిపోతుంది. అది కూడా తిరిగొద్దామనే ఆలోచన లేకపోతేనే. అలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న ఎల్‌ సాల్వెడార్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌కు విధించిన శిక్షతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయింది. ఆ క్రిమినల్‌కు ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారో తెలుసా? అక్షరాలా 13వందల 10 సంవత్సరాలు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం.
కేవలం 65లక్షల జనాభా ఉండే ఈ దేశంలో క్రిమినల్స్ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా లక్షా 50వేలు. అదికూడా అంచనా మాత్రమే. అంతకుమించి ఉంటారనేందుకు ఇటీవల అరెస్టవుతున్న క్రిమినల్స్ సంఖ్యే తేల్చేస్తోంది. అలా అరెస్ట్ అయిన వారిలో ఓ గ్యాంగ్‌స్టర్‌కు విధించిన జైలు శిక్ష ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎల్ సాల్వెడార్‌లోనే మోస్ట్ వాంటెడ్.పేరు విల్మేర్‌ సెగోవియా. ఇతడి క్రిమినల్ యాక్టివిటీస్ తెలిస్తే నిలువునా వణుకుపుట్టడం ఖాయం. 33 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. మరో తొమ్మిది మంది హత్యకు కుట్రలు పన్నాడు. దొమ్మీలూ, దోపిడీల గురించయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాదకద్రవ్యాల చీకటి ప్రపంచంలో ఇతడు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అందుకే ఈ ప్రమాదకర గ్యాంగ్‌స్టర్‌కు ఎల్ సాల్వెడార్‌ న్యాయస్థానం ఏకంగా 1310 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నరహంతకుడు మారా సాల్వట్రుచ గ్యాంగ్‌కు చెందిన షల్టన్‌ సెల్‌ సభ్యుడు. ఈ గ్యాంగ్‌ ఎల్‌ సాల్వెడార్‌లో ఎన్నో క్రూరమైన నేరాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్‌నే ఎంఎస్-13 అని కూడా పిలుస్తారు.
ఇతగాడి క్రిమినల్ హిస్టరీ ఎలా ఉన్నా ఒక నేరస్తుడికి ఏకంగా 13 శతాబ్దాలకుపైగా శిక్ష విధించడం మాత్రం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఎల్ సాల్వెడార్‌లో ఇలాంటి భారీ శిక్షలు విధించడం కొత్తేం కాదు. విల్మేర్‌ సెగోవియా కంటే ముందే మరో గ్యాంగ్‌స్టర్‌కు ఈ తరహా జైలు శిక్ష విధించింది ఎల్ సాల్వెడార్ కోర్టు. మిగ్వెల్‌ ఏంజిల్‌ పోర్టిల్లో అనే గ్యాంగ్‌స్టర్‌ మొత్తం 22 క్రూరమైన హత్యా నేరాలు చేశాడు. అంతేగాక పలు హత్యాయత్నాలు, దాడులు, బలవంతపు వసూళ్లలో అతని పాత్ర ఉంది. దాంతో మిగ్వెల్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 945 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అయితే, వందేళ్లు కూడా జీవించని వ్యక్తులకు ఇలా సుదీర్ఘ జైలు శిక్షలు విధించడం వెనుక ఓ ఆశక్తికర అంశం ఉంది. ఇలా సుదీర్ఘ శిక్ష పడిన నేరస్తులు శిక్షాకాలం పూర్తి కాకుండా మరణిస్తే.. ఆ శిక్ష పూర్తయ్యే వరకూ మృతదేహాలను నిందితుడి ఫ్యామిలీకి ఇవ్వరు. వాటిని ఫ్రీజర్లలోనే ఉంచి శిక్షాకాలం పూర్తయిన తర్వాతే కుటుంబ సభ్యులకు అందజేస్తారట. దీంతో నేరాల సంఖ్య తగ్గుతుందనేది ఎల్ సాల్వెడార్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని కాస్త పక్కనపెట్టి ఎంఎస్-13 గ్యాంగ్ విషయానికొస్తే.. ఈ గ్యాంగ్‌లో ఏకంగా 60 వేల మంది వరకు సభ్యులు ఉన్నారని ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు వాళ్లందరినీ జైల్లో పెట్టేందుకు ఒక పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఇప్పటికే కొన్ని వేల మంది గ్యాంగ్‌ సభ్యులు ఎల్‌ సాల్వెడార్‌ జైళ్లలో ఉన్నారు. అందుకే ఎల్ సాల్వెడార్ రీసెంట్‌గా ఓ భారీ జైలును నిర్మించి వార్తల్లోకి ఎక్కింది. వందల మంది క్రిమినల్స్‌ గుంపులుగా వచ్చిపడుతున్న ఈ జైలును ఎల్ సాల్వెడార్ రీసెంట్‌గా నిర్మించింది. ఈ జైలు రాజధాని శాన్‌ సాల్వెడార్‌ నుంచి గ్నేయ దిశగా 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని భూమ్మీద నిర్మించిన నరకంగా అభివర్ణిస్తారు. ఇప్పటికే వేలమంది ఖైదీలను ఈ జైలుకు పంపారు.
ఇందులో 40వేల మంది క్రిమినల్స్‌ను ఉంచే వీలుంది. అలాంటి జైలు ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డ్‌ పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 60వేల మంది క్రిమినల్స్ ఉన్న మారా సాల్వట్రుచ గ్యాంగ్‌‌లో ఇప్పటివరకూ అరెస్ట్ అయింది దాదాపు రెండువేల మంది మాత్రమే. మిగిలిన క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించాలంటే కొత్తగా నిర్మించిన జైలు లాంటివి మరిన్ని అవసరం అవుతాయి. ఇప్పుడు ఎల్ సాల్వెడార్ అదే పనిలో ఉన్నట్టు ప్రకటించింది. ఉగ్రవాద నిర్బంధ కేంద్రంగా పేరు పెట్టిన కొత్త జైలుకు తొలుత 2వేల మంది ఖైదీలను తరలించారు. వారంతా హత్యలు, దాడులు, వంటి ఘోర నేరాలకు పాల్పడే గ్యాంగ్‌స్టర్లుగా ఎల్‌ సాల్వెడార్‌ ప్రకటించింది. మరోవైపు.. ఎల్ సాల్వెడార్‌ ప్రభుత్వం యాక్షన్‌పై ప్రతిపక్షాలతో పాటూ మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాజకీయ కక్షతోనే పలువురిని అరెస్టు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల హక్కులను బుకెలే సర్కార్ కాలరాస్తోందని మండిపడుతున్నారు. అయితే ఖైదీలకు కోర్టుల్లో తమ వాదనలను వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకునే ఛాన్స్ కల్పిస్తామని అధ్యక్షుడు నయీబ్‌ బుకెలే తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం అమాయకులను అరెస్టు చేస్తుందని, ఎందరో పోలీసు కస్టడీలో మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్టు చేసినట్టు విమర్శిస్తున్నాయి. కానీ, ప్రభుత్వ చర్యలను ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎల్ సాల్వెడార్‌పై వరల్డ్ క్రైమ్ కేపిటల్‌ అనే ముద్ర చెరిగిపోదంటున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా రోడ్లు తిరుగుతున్నామంటున్నారు. మరి గ్యాంగ్‌స్టర్లపై బుకెలే సర్కార్ ఇదే దూకుడు కొనసాగిస్తుందేమో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...