HomeTELANGANAG20 సమ్మిట్ : యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇస్తుందా ?

G20 సమ్మిట్ : యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇస్తుందా ?

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

భారత్ కెప్టెన్సీ బాధ్యతలతో జీ20 శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం.. అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కోవిడ్, ఆర్ధిక మాంద్యం లాంటి పరిణామాలతో చిన్న దేశాలయితే ఏ రోజు ఏం జరుగుతుందో తెలీక చిగురుటాకులా వణికిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వశుదైక కుటుంబం అంటూ జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం చాలా దేశాల్లో ఆశలు కల్పించింది. దీనికి కారణం ఇతర దేశాలకు సాయం చేసే గుణం ఉన్న దేశం కావడం ఒకటైతే.. మరో అంశం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీకి ఉన్న స్నేహమే. దీనికితోడు గత ఏడాది జరిగిన పలు సమావేశాల్లో యుద్ధం మంచిది కాదని మోడీ ఇచ్చిన సందేశంపై ప్రపంచం మొత్తం పొగడ్తల వర్షం కురిపించింది. సమర్‌కండ్ వేదికగా జరిగిన షాంఘై సదస్సులో అయితే ఇది యుద్ధ యుగం కాదన్న మోడీ మాటకు పుతిన్ సైతం పాజిటివ్‌గా స్పందించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. దీంతో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం ఒక్కభారత్‌తోనే సాధ్యమవుతుందనీ, దీనికి జీ20 శిఖరాగ్ర సదస్సుకు మించిన వేదిక మరొకటి దొరకదనే విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడా సమయం రానే వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఇది విదేశాంగ మంత్రుల మధ్య జరిగే సమావేశం. రెండురోజుల ఈ సదస్సుపై అమెరికా సహా పశ్చిమ దేశాలు చాలా ఆశలే పెట్టుకున్నాయి. పైకి ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి ఎంకరేజ్‌ చేస్తున్న ఈ దేశాలు యుద్ధానికి ఎలా అయినా ఫుల్‌స్టాప్ పెట్టాలనీ, అది భారత్‌తోనే సాధ్యం అంటున్నాయి. కానీ, ఇదేమంత ఈజీ కాదు. దీనికి కారణం గతేడాది ఇదే జీ20 సదస్సులో ఆ దేశాలు చేసిన తప్పులే. 2022 నవంబరులో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన శిఖరాగ్ర సదస్సులో కూటమిలోని చాలా దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిని యుద్ధంగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించాయి. కానీ, జీ-20 దేశాల్లో భాగమైన రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై తాము చేస్తున్నది యుద్ధం కాదని, ప్రత్యేక సైనిక చర్య మాత్రమే అని సమాధానమిచ్చింది. అటు చైనా కూడా మాస్కోకు వంత పాడింది. దీంతో ఆ సమావేశాల అనంతరం వెల్లడించిన సంయుక్త ప్రకటనలో రష్యా పేరును ప్రస్తావించకుండా ఉక్రెయిన్‌లో యుద్ధం అని మాత్రమే పేర్కొన్నారు. ఆ ప్రకటనపైనే మెజారిటీ సభ్య దేశాలు సంతకాలు చేశాయి.
గతవారం జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు అధినేతల సమావేశంలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని యుద్ధంగా పరిగణించేందుకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన వెలువర్చకుండా అధ్యక్ష ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది. బాలి ఒప్పందం నుంచి రష్యా, డ్రాగన్ కంట్రీ చైనా వైదొలిగాయని, యుద్ధం అనే పదాన్ని ఉపయోగించేందుకు నిరాకరించారని ఆ సమావేశం అనంతరం భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తాజా విదేశాంగ మంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, విదేశాంగ మంత్రుల సమావేశంలో అయినా యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావాలని ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌ భావిస్తోంది. ఈ విషయంలో చైనా, రష్యాను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆ రెండు దేశాలు ఓ నిర్ణయానికొస్తే.. యుద్ధం ముగింపు కోసం ఏం చేయాలనేదానిపై ఓ అంచనాకు రావచ్చనే అభిప్రాయంలో జీ20 దేశాలున్నట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. మాస్కో మాత్రం రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని పాశ్చాత్య దేశాలు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయనే ఆరోపిస్తోంది. అమెరికా‌, దాని మిత్రదేశాల విధ్వంసక విధానాల వల్ల ఈ ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉందనీ.. వాటి తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టిందని ఆరోపించిన మాస్కో.. పేద దేశాల కష్టాలను మరింత తీవ్రం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌ చేరుకున్న సమయంలోనే ఈ ప్రకటన చేయడంతో తాజా విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ల మధ్య చర్చలు అసాధ్యంగానే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో బాలిలో జరిగిన జీ20 సదస్సు నుంచి వారిద్దరు ఒకే దగ్గర కూర్చున్న సందర్భాలు లేవు. బాలి సదస్సు నుంచి లావ్రోవ్‌ బయటకు వెళ్లిపోయారు. పోనీ, చైనాను కన్విన్స్ చేద్దాం అనుకున్నా ఇటీవలి నిఘా బెలూన్ల ఎపిసోడ్‌తో బ్లింకెన్, క్విన్ గాంగ్‌ మధ్య చర్చ కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో ఈ ముగ్గురి మధ్య సమావేశంపై భారత్ చొరవతీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు.. అలా అని మద్దతివ్వలేదు కూడా. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ఆ దిశగా కావాలంటే ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విదేశాంగ మంత్రుల మధ్య భేటీలే కష్టంగా మారాయి. ఇలాంటి సమయంలో యుద్ధంపై ఏకాభిప్రాయానికి వచ్చేదెప్పుడు.. యుద్ధం ముగింపు చర్చలు జరిగేదెన్నడు అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో యుద్ధం అంశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించడం భారత్‌కు కత్తిమీద సాముగానే కనిపిస్తోంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...