2016లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై తరచూ నోరు పారేసుకునే కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మరోసారి అదే రకమైన వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. బీజేపీ ప్రభుత్వం తాము చేసినట్టు చెప్పుకునే సర్జికల్ స్ట్రైక్స్ కు అసలు ఆధారాలే లేవని.. ఇది కేవలం బీజేపీ అల్లిన కట్టు కథ అంటూ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూలో ఓ సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ సీనియర్.. ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా మరోసారి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన గౌరవ్ భాటియా.. దిగ్విజయ్ సింగ్ మన దేశ సైనికులను అనుమానిస్తున్నాడనీ.. ఇలాంటివి చేసి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటేననీ అన్నాడు. రాహుల్ గాంధీ వంటి నకిలీ నేతలకు ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించేందుకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయనీ.. కానీ దాని కోసం సైన్యాన్ని పావులా వాడుకోవటం మానుకోవాలని భాటియా సమాధానం ఇచ్చారు.
2016లో ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న ఇండియన్ ఆర్మీ స్థావరంపై దొంగ దాడి చేసిన పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు.. 19 మంది భారత సైనికులను హత్యచేశారు. ఇందుకు ప్రతీకారంగా 11 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ దళం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి చాలా మంది తీవ్రవాదులను హతమార్చింది. ఈ దాడిలో 70 మంది తీవ్రవాదుల ప్రాణాలు పోయాయని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. కానీ మరణించిన వారు తీవ్రవాదులు కాదనీ.. తమ సైన్యంపై భారత సైన్యం దొంగ దాడి చేసి సైనికులను హతమార్చిందనీ చెప్పింది. ఎంత మంది మరణించారన్న విషయం మాత్రం చెప్పలేదు. పాకిస్తాన్ స్వయంగా దీనిపై స్పందించినప్పటికీ కాంగ్రెస్ నేతలు తరచుగా సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు లేవంటూ వ్యాఖ్యానిస్తూ వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ పై మళ్ళీ నోరు పారేసుకున్న డిగ్గీ రాజా
Published on