సాయి ధరమ్ తేజ్, సంయుక్త హీరో హీరోయిన్లుగా కార్తీక్ వర్మ తెరకెక్కించిన విరూపాక్ష.. ఊహించని స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. విడుదలైన మొదటి 5 రోజుల్లో సుమారు 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని సినీ ట్రేడ్ వర్గాల న్యూస్. మొదట వారం రోజుల్లో 50 కోట్లకు దగ్గరగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాకుండా హయ్యెస్ట్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించిన సినిమా అవుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. సినిమా రిలీజ్ కు ముందు ఎంతగా ప్రమోషన్లు చేసినప్పటికీ.. బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందన్న అంచనాలు మాత్రం ఎవరికీ లేదు. అందుకే సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు కాస్త తక్కువగా ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక ఓరల్ పబ్లిసిటీ వల్ల.. సినిమా ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందని వచ్చిన పబ్లిట్ టాక్ వల్ల మూడో రోజు నుంచి కలెక్షన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సినిమా కోసం ఖర్చైన బడ్జెట్ ఎప్పుడో దాటేసిందని క్రిటిక్స్ చెప్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తొలి రెండు వారాల్లో సినిమా కనీసం 75 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చు. ఇదే జరిగితే రూపాయికి రెండింతల లాభం సంపాదించి నిర్మాతనూ, బయ్యర్లనూ, డిస్ట్రిబ్యూటర్లను కాసుల వర్షంలో తడిపేసినట్టే. ఈ వీకెండ్ లో విరూపాక్ష కలెక్షన్లు గట్టిగానే ఉండబోతున్నాయని టాక్. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారనీ.. ఈ వీకెండ్ సినిమా గట్టి వసూళ్ళు రాబట్టడం ఖాయమనీ ట్రేడర్ల అంచనా. ఏది ఏమైనా.. సైలెంట్ గా వచ్చి ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ కావటం తేజ్ కెరీర్ కు బూస్ట్ ఇవ్వటంతో పాటు కొత్త హీరోయిన్ సంయుక్త ఖాతాలో మరో హిట్ గా నిలిచి… టాలీవుడ్ కు కలెక్షన్ల కళ తెచ్చిందన్నమాట.