HomeNATIONAL NEWSకరోనా డేంజర్ బెల్స్ : మళ్ళీ మాస్క్ లు తప్పనిసరి

కరోనా డేంజర్ బెల్స్ : మళ్ళీ మాస్క్ లు తప్పనిసరి

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరగటం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో రాష్ట్రాలకు గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఊహించనంతగా పెరిగిపోయాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్న వాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ.. వీలైతే ఇంటి నుంచి పని చేసే ప్రయత్నం చేయాలంటూ సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పరిస్థితులను మరోసారి సమీక్షించింది.
అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం కరోనా గురించి మరీ అంత ఆందోళన చెందాల్సిన అ‌వసరం లేదంటున్నారు. కరోనా కేసులు పెరగటం అనేది పరీక్షలు చేయటంపై ఆధారపడి ఉన్నదని.. ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తే అన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని చెప్తున్నారు. కరోనా వైరస్ మన శరీరంలో లేదని చెప్పలేమనీ.. ఎక్కువ మంది శరీరాల్లో వైరస్ ఉంది కానీ రోగ నిరోధక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉండటం వల్ల వైరస్ మనల్ని ఏమీ చేయలేకపోతున్నదని అంటున్నారు. అయితే.. జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ఉన్న వారు మాత్రం కనీసం జనంతో కలవకుండా ఉండటం ఖచ్చితంగా చేయాలంటున్నారు. దీని వల్ల కరోనా కొత్త కొత్త వేరియంట్ల వ్యాప్తి తగ్గుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. ఇప్పటికిప్పుడు కరోనా వల్ల వచ్చిన ముప్పేమీ లేదనీ.. కాకపోతే వయసు మీద పడిన వాళ్ళు, ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ప్రమాదమేనని చెప్తున్నారు.

FOLLOW US

More like this