HomeNATIONAL NEWSత్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు

త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

లిక్కర్ స్కామ్ లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైళ్ళో ఉండగా.. మరి కొంత మంది నిందితులను ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణ సాగుతున్న సమయంలో సడన్ గా సీబీఐ ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైళ్ళో ఉన్న నిందితుడు కేజ్రీవాల్ పేరు చెప్పటంతో పాటు కొన్ని ఆధారాలు ఇచ్చాడని పేర్కొంటూ ఏకంగా ముఖ్యమంత్రినే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం ఊహించని పరిణామమేమీ కాదు. ఎందుకంటే.. ఈడీ లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోదియాను అరెస్టు చేసిన రోజునే.. ఏదో ఒక రోజు సీఎం కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీబీఐ ఆ వార్తలను నిజం చేసే దిశగా కీలక అడుగు వేసింది.
సీబీఐ నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఎవరో ఒకరు ఏదో చెప్పారని సరైన ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిని విచారిస్తామని చెప్పటం సరికాదంటూ మండిపడ్డాడు. నేను మోడీకి వంద కోట్లు లంచం ఇచ్చానని చెప్తే.. మోడీని కూడా అరెస్టు చేసి విచారిస్తారా అంటూ సీబీఐని ప్రశ్నించాడు కేజ్రీవాల్. నిరాధార ఆరోపణలతో బీజేపీ చెప్పినట్టే ఈడీ, సీబీఐ నడుచుకుంటున్నాయని ఆరోపించాడు. మరో వైపు లిక్కర్ కేసులో సుఖేశ్ అనే వ్యక్తి వాంగ్మూలం కీలకంగా మారింది. కిలో నెయ్యి కోటి రూపాయలకు కేజ్రీవాల్ అమ్మాడు అంటూ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు చూపించటం కేజ్రీవాల్ పై ఆరోపణలకు బలాన్నిస్తోంది. సుఖేశ్ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఆధారాల వల్లనే సీబీఏ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
సుఖేష్ చంద్రశేఖరన్ ప్రస్తుతం తీహార్ జైళ్ళో ఉన్నాడు. వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన సుఖేష్ తీహార్ జైలు అధికారులకు కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి రాజభోగాలు అనుభవిస్తున్నాడు. త్వరలోనే డబ్బులు ఎరగా చల్లి తాను బయటపడతానని ఆశతో ఉన్న సుఖేష్ కు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ కూడా జైలుకు రావటం చూసి తనకు మార్గాలన్నీ మూసుకుపోయాయని అర్థం చేసుకున్నాడు. తాను జైళ్ళో ఉన్నప్పుడు కేజ్రీవాల్ మాత్రం ఎందుకు బయట ఉండాలన్న కడుపు మంటతోనే తన వద్ద ఉన్న మొత్తం సాక్ష్యాలను, లిక్కర్ స్కామ్ వివరాలను సీబీఐ ముందు పెట్టేశాడు సుఖేష్. ఇదే ఇప్పుడు కేజ్రీవాల్ కొంప ముంచింది. తనను సుఖేష్ ఇరికిస్తాడని ఊహించని కేజ్రీవాల్.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాడు తప్ప తప్పించుకునే మార్గం లేదని అతడికి క్లియర్ గా అర్థమైంది. సరైన ఆధారాలు లేకుండానే ఎలా అరెస్టు చేస్తారంటూ కేజ్రీవాల్ సీబీఐని ప్రశ్నించటానికి కారణం.. సుఖేష్ సీబీఐకి ఏం ఆధారాలను ఇచ్చాడో తెలుసుకోవాలనే. విచారణలో ఇప్పటి వరకు మిగతా నిందితులు చెప్పిన వివరాలతో కేజ్రీవాల్ విచారణ అంశాలు మ్యాచ్ అయితే మాత్రం కేజ్రీవాల్ అరెస్టు తప్పదు. ఒక వేళ అరెస్ట్ అయితే.. సీబీఐ లేదా ఈడీ కేసుల్లో బెయిల్ రావటం చాలా కష్టం. నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అంటూ సీబీఐ లేదా ఈడీ సింపుల్ గా కోర్టులో పిటిషన్ వేస్తుంది.. సో.. నిందితుడు బయటకు రాకుండా కోర్టు బెయిల్ నిరాకరిస్తుంది. అంటే.. పాపం శ్రీ కేజ్రీవాల్ గారు త్వరలోనే తన తోటి మంత్రులతో కలిసి భోజనం చేసే చూడముచ్చటైన సన్నివేశం సాక్షాత్కరిస్తుందన్నమాట.. కాకపోతే మనం చూడలేం.. అంతే..!

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...