HomeTELANGANAకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అంతర్యుద్ధంబీజేపీకి ఇదే సరైన సమయం

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అంతర్యుద్ధం
బీజేపీకి ఇదే సరైన సమయం

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో అనుకోని పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ లో కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు మధ్య వివాదం ఎన్నడూ లేనంత తీవ్ర రూపం దాల్చటం.. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో కూడా ఆధిపత్య పోరు, అంతర్యుద్ధం జరగటం.. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద మార్పులే సంభవిస్తాయని భావించవచ్చు. జరుగుతున్న పరిణామాలను ఓసారి విశ్లేషిస్తే..

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన నాటి నుంచీ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ఏక పక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాడంటూ జగ్గారెడ్డి, వి హనుమంతరావు వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేయటంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా రేవంత్ రెడ్డి గానీ.. ఆయన అనుచరులు గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. తాను చేయాలనుకున్న పనిని కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ఆదేశాల రూపంలో టీకాంగ్రెస్ నేతలతో చేయించాడు రేవంత్ రెడ్డి. తిరుగుబాటు ఆలోచనలు ఉన్న రెబల్స్ కు రాహుల్ గాంధీ ద్వారా పరోక్షంగా వార్నింగ్ ఇప్పించటమే కాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాగూర్ తో డైరెక్ట్ హెచ్చరికలు కూడా చేయించాడు. టీ కాంగ్రెస్ లో తానే కింగ్ అనీ.. తన నిర్ణయమే ఫైనల్ అనీ చెప్పకనే చెప్పాడు రేవంత్. అధిష్టానం రేవంత్ వైపు నిలబడటంతో సీనియర్లు రేవంత్ ను ఎదుర్కోలేకపోయారు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ను ఎదురిస్తూనే వచ్చారు. ఇదంతా గతం.. ఇప్పుడు సీన్ మారింది. తామే కాంగ్రెస్ లో సీనియర్లమనీ.. రేవంత్ లాంటి వాళ్ళు తమ తర్వాతేననీ రెబల్స్ మరోసారి తిరుగుబాటు చేశారు. ఇటీవల కాంగ్రెస్ లో జరిగిన కమిటీ బాధ్యుల నియామకాల్లో తమ మాట ఎక్కడా చెల్లుబాటు కాలేదనీ..

రేవంత్ రెడ్డి తాను అనుకున్న వాళ్ళకే పదవులు కట్టబెట్టాడనీ సీనియర్లు రోడ్డెక్కారు. కానీ.. రేవంత్ మాత్రం ఇంతకు ముందులా సైలెంట్ గా లేడు. ఈసారి తానేమిటో.. కాంగ్రెస్ లో తనకున్న ఫాలోయింగ్ ఎంతటిదో చూపించాలనుకున్నట్టున్నాడు.
అందుకే తన అనుచరులతో రెబల్స్ కు భారీ షాకిప్పించాడు. ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు ప్రముఖ నాయకులంతా ఒక్కటై.. సీనియర్లకు ఎదురు తిరిగారు. తాము కూడా కాంగ్రెస్ లోకి వలస వచ్చిన వాళ్ళమేననీ.. తామంతా రేవంత్ వెంటే ఉంటామంటూ రేవంత్ వర్గం ఎదురు తిరగటంతో కాంగ్రెస్ జాతీయ అధిష్టానం రంగంలోకి దిగాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఏకంగా రెండు వర్గాలుగా చీలిపోయే స్థితికి వచ్చేసిందని గ్రహించిన ఏఐసీసీ.. ఈ అగ్గని చల్లార్చేందుకు దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది. సమస్యను పరిష్కరించి సీనియర్లను ఊరుకోబెట్టి కాంగ్రెస్ క్లాష్ ను క్లోజ్ చేయాలని ప్రస్తుతం ఏఐసీసీ భావిస్తోంది. దిగ్విజయ్ ఎంట్రీతో కాంగ్రెస్ రెబల్స్ సైలెంట్ కావటంతో పాటు తమ స్పీడుకు బ్రేకులు వేశారు. ఇదే తెలంగాణ బీజేపీకి కలిసి వచ్చే అంశం కానుంది. కాంగ్రెస్ లో ఇదివరకు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో తిరుగుబాటు జరగటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారిని బీజేపీలోకి లాగేయాలని ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం రచిస్తోంది. మెల్లమెల్లగా కాంగ్రెస్ రెబల్స్ ను బజ్జగించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి ఇది సువర్ణావకాశం.

టీఆర్ఎస్ లోనూ రెబల్స్..

మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ పార్టీలో ముసలం ఏర్పడినట్టు కనిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావటం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. తమ ఆదేశాలను పట్టించువద్దంటూ తమ జిల్లా కలెక్టర్లకు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలిస్తున్నారు అనేది ఈ ఐదుగురు ఎమ్మెల్యేల ఆరోపణ. తమ ప్రాంతాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి పెత్తనం చేయటం సహించని ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై చర్చించుకోవటం దుమారం రేపింది. సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా.. ఏ మంత్రి అయినా కేసీఆర్ పట్ల విపరీతమైన భయం, భక్తిని ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది అందుకు భిన్నం. మొదటిసారి కేసీఆర్ కు తెలియకుండా కేసీఆర్ కు సన్నిహిత మంత్రి అయిన మల్లారెడ్డిపై తిరుగుబాటు చేయాలనుకోవటం సంచలనమే. తిరుగుబాటు, అసంతృప్తి అనేవి లేని రాజకీయ పార్టీ అనేది ఉండదు. అయితే.. అవి ఎంత వరకు లోలోపల పరిష్కారం అవుతాయో అంత వరకు ఆ పార్టీలో అన్ని సక్రమంగానే ఉన్నట్టు. ఎప్పుడైతే ఒక్క సారి తిరుగుబాటు స్వరం బట్టబయలు అవుతుందో.. అది రాబోయే మరిన్ని తిరుగుబాట్లకు దారి వేసినట్టవుతుది. కారు పార్టీలోనూ అసమ్మతులు.. అసంతృప్తులు ఉన్నారనేది నిజం. ఎన్నికల వేళ అవి మరింత ముదిరి పాకాన పడితే మాత్రం.. అది కేసీఆర్ కు ఏమాత్రం మంచిది కాదు. ఈ పరిణామం కూడా బీజేపీకి చాలా కలిసి వచ్చేదే. ఉద్యమ సమయం నాటి నుంచి కేసీఆర్ వెంట ఉండి కూడా ఏ పదవీ అను‌భవించని వాళ్ళు టీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పెద్ద పదవులను ఎత్తుకెళ్ళిన వారిపై రగిలిపోయే పాత నాయకులకు కొదవే లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్న భయం ఉన్న వాళ్ళూ.. ఇతర పార్టీల నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు.. కాంట్రాక్టులు దక్కక బిక్కు బిక్కుమంటున్న వాళ్ళు.. ఇలా చాలా మంది రెబల్స్ టీఆర్ఎస్ లోనూ ఉన్నారు. కాకపోతే వారికి సమయం రాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళందరికీ బీజేపీ గాలం వేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కేసీఆర్ తో పాటే ఉండి ఆయనకు ఎదురు తిరిగిన ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగితే.. చాలా మంది టీఆర్ఎస్ రెబల్స్ ను బీజేపీలోకి లాగేయటం సులభమవుతుంది. ఇలా రెండు రకాలుగా బీజేపీకి బంపర్ ఆఫర్ దొరికింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కనుక సక్సెస్ అయితే.. తెలంగాణ రాజకీయాల్లో కుదుపు ఖాయమే. చూద్దాం.. ఈ అవకాశాలను తెలంగాణ బీజేపీ ఎంత మేరకు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందో. !

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...