HomeNATIONAL NEWSసూసైడ్ బాంబ్ అటాక్ బెదిరింపుకు మోడీ షాకింగ్ కౌంటర్.. అదుర్స్

సూసైడ్ బాంబ్ అటాక్ బెదిరింపుకు మోడీ షాకింగ్ కౌంటర్.. అదుర్స్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కనుగొనలేని 25 సమస్యలు ఇవే అంటూ యూరప్ మీడియా ఓ లిస్ట్ ప్రకటించింది అప్పట్లో సుమారు పదేళ్ళ క్రితం. అందులో మొట్ట మొదటి సమస్య.. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల సమస్య.. అంటే కశ్మీర్ సమస్య. రెండో సమస్య ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య అయితే.. మూడోది ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా అడ్డుకోవటం. ఈ రెండింటినీ పక్కన పెడితే.. ఇక నాలుగో సమస్య.. మళ్ళీ ఇదే భారత్ లోనిదే. అదే.. అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీద్ సమస్య. భారత్ కేవలం మత ఛాందసం మీద బతికే దేశమనీ.. భారీ జనాభా తప్ప మరేమీ అక్కడ లభించదనీ వెస్టర్న్ దేశాల అభిప్రాయం ఒకప్పుడు. సుమారు పదిహేనేళ్ళ క్రితం జార్జ్ సోరోస్ అనే ఒ పెద్ద మనిషి.. భారతదేశం ఎందుకూ పనికిరాని హిందూ సిద్ధాంతాన్ని మోస్తున్న ఓ పనికిమాలిన దేశం అని ప్రపంచం ముందు మాట్లాడితే.. భారతదేశంలోని ఒక్కడు కూడా అందుకు సమాధానం చెప్పినోడు లేడు. చివరికి.. అప్పటికి ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ కూడా దీన్ని ఖండించలేదు సరికదా.. కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఆ జార్జ్ సోరోస్ ఇచ్చే సొమ్ముతోనే కదా సోనియా ఆండ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచంలో ఎన్నటికీ పరిష్కారం కాని సమస్యగా ప్రపంచం వేలెత్తి చూపించిన అయోధ్య సమస్య ఎప్పుడో సమసిపోయింది. ఇక కశ్మీర్ వంతు వచ్చింది. భారత దేశ చరిత్రలో ఎవరూ చేయలేని సాహసోపేతమైన పని మోడీ ప్రభుత్వం చేసి చూపించింది. కశ్మీర్ ను అధఃపాతాళానికి తొక్కేసిన ఆర్టికల్ 370ని రద్దు చేసి.. కశ్మీర్ ఖచ్చితంగా పూర్తిగా భారత్ లో భాగమే అని బల్లగుద్ది చెప్పింది. ఇదే ఇప్పుడు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కు.. చైనాకు నచ్చటం లేదు.
కశ్మీర్ సమస్య కూడా పరిష్కారం అయిపోయిందని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంతో సతమతమయ్యే కశ్మీర్ లో ఇప్పుడు ఏ సమస్యా లేదని చెప్పేందుకే.. ప్రతిష్టాత్మక జీ-20 సదస్సును కశ్మీర్ నడిబొడ్డున నిర్వహించేందుకు సిద్ధపడ్డారు మోడీ ఆండ్ టీమ్. ఇది నచ్చని పక్క దేశపు కుక్కలు కేరళలో మోడీ పర్యటిస్తే ఆత్మాహుతి దాడి చేసి చంపేస్తామంటూ ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. తాము ఏం చేయగలమో చూపించేందుకు ఇటీవలే కశ్మీర్ లో సైనిక వాహనంపై దాడి చేసి నలుగురు సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోటానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కానీ మోడీ మాత్రం వెనకడుగు వేయాలనుకోలేదు. కశ్మీర్ సహా దేశమంతా ఇంటలిజెన్స్ వర్గాలను అలర్ట్ చేసి.. తీవ్రవాద కదలికలను నిశితంగా కనిపెడుతూ ఉండాలని భారత హోం శాఖ గట్టి ఆదేశాలిచ్చింది. కేరళలో ప్రధానమంత్రి పర్యటిస్తే ఏం జరుగుతుందో నివేదిక తెప్పించుకుంది హోంశాఖ. ముందుగా ప్రకటించినట్టుగానే కేరళలో మోడీ పర్యటించారు విజయవంతంగా. మామూలుగా ఏదైనా రాష్ట్రంలో పర్యటిస్తే కారులో నుంచి అభివాదాలు చేస్తూ జనాన్ని పలకరించే మోడీ.. ఈ సారి కారు దిగి నడి రోడ్డుపై నడుచుకుంటూ పర్యటించాడు. సూసైడ్ బాంబుతో లేపేస్తామన్న తీవ్రవాద సంస్థలకు.. ఇదుగో నేను ఇక్కడే ఉన్నా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. అన్నట్టుగా కౌంటర్ ఇచ్చాడు మోడీ.
పంతానికి పోతే ప్రాణాన్ని పణంగా పెట్టినట్టే అని తెలిసి కూడా పట్టు విడవకుండా కేరళలో పర్యటించటం.. అదీ నడి రోడ్డుపై నడుస్తూ పర్యటించటం నిజంగా సాహసమే. కేరళ టూర్ విషయంలో వార్నింగ్ కు కౌంటర్ ఇచ్చిన మోడీ.. కశ్మీర్ లో జీ-20 విషయంలో ఏం చేయబోతన్నాడు అనేది అంతర్జాతీయంగా మోస్ట్ ఇంట్రస్టింగ్ విషయంగా మారింది.
25 దేశాల ప్రతినిథులు, ప్రధానమంత్రులు, డిప్లొమాట్లు, విదేశాంగ మంత్రులు.. ఇలా పెద్ద పెద్ద తలకాయలంతా కశ్మీర్ లో జరగాల్సిన జీ-20కి హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రరిస్టుల హెచ్చరికలు రావటం అంత తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు. ఏదైనా జరగరానిది జరిగితే.. భారత దేశ చరిత్రలో అది చెరగని మచ్చగా మిగిలిపోవటమే కాకుండా.. యావత్ ప్రపంచం భారతదేశాన్ని టెర్రరిజంతో నలిగిపోతున్న దేశంగా ముద్రవేసి వెలి వేస్తుంది. అలాగని కశ్మీర్ వేదికను మార్చేస్తే.. భారతదేశ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టే. కశ్మీర్ లో కాకుండా వేరే వేదికపై జీ-20 సమ్మిట్ ను నిర్వహించాల్సి వస్తే.. పాకిస్తాన్, చైనా దేశాల నుంచి వస్తున్న తీవ్రవాద హెచ్చరికలకు భారత్ భయపడిందని భావిస్తాయి ప్రపంచ దేశాలు. అంతే కాకుండా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్ ఇంకా అల్లకల్లోలంగానే టెర్రరిజం గుప్పిట్లోనే ఉందే తప్ప మార్పేమీ లేదని మనమే అంగీకరించినట్టు అవుతుంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది నిజంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశం. ముందే మోడీ ప్రకటించినట్టు జీ-20 సమ్మిట్ ను కశ్మీర్ లో ఏ ఇబ్బందులూ లేకుండా కనుక నిర్వహిస్తే.. పైన పేర్కొన్నట్టుగా భారతదేశంలో కశ్మీర్ అనే సమస్య కూడా ఇప్పుడు లేదని ప్రపంచానికి చాటి చెప్పినట్టే. సభ సక్సెస్ అయితే.. భారతదేశం స్థాయి ప్రపంచం ముందు పది రెట్లు పైకెక్కినట్టు అవుతుంది. ఇలాంటి అగ్ని పరీక్షను భారత్ ఎలా ఎదుర్కోబోతోందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...