తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా హవానే కనిపిస్తోంది. థియేటర్ల ముందు బాలయ్య ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. ఇక మాస్ ప్రేక్షకుల హంగామా మామూలుగా లేదు. ఏ థియేటర్ ముందు చూసిన బాలకృష్ణ కటౌట్ కు పాలాభిషేకాలు చేయటం.. కొబ్బరికాయలు కొట్టడం.. బాంబులు పేల్చటం.. ఇదే కనిపిస్తోంది. అఖండ సూపర్ హిట్ తర్వాత మాస్ ప్రేక్షకులకు బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు.
సినిమాలోని మాస్ డైలాగ్స్ కు ప్రేక్షకుల ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమా చూసిన జనం తమ ముబైల్ ఫోన్లలో బాలయ్య ఇంట్రొడక్షన్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలకు కూడా రెస్పాన్స్ మామూలుగా లేదు. ఎక్కడ చూసిన జై బాలయ్య స్లోగన్ తప్ప మరోటి వినిపించటం లేదు. మొత్తానికి బాలయ్య సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత సంతోషాన్ని గిఫ్ట్ గా ఇచ్చేశాడు. బాలకృష్ణ సినిమా రికార్డులన్నీ ఈ దెబ్బతో బద్దలు కావటం ఖాయమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
గోపీచంద్ మలినేని ఎలివేషన్ సీన్లకు తోడు.. సాయి మాధవ్ బుర్రా రాసిన ఊర మాస్ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. సినిమాలో ప్రతి సీన్లోనూ ఖచ్చితంగా ఓ మాస్ పంచ్ ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మొత్తానికి.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడన్నమాల బాలకృష్ణ.