HomeNATIONAL NEWSకేంద్రంలో కొత్త ఫ్రంట్ : బీజేపీని ఒంటరి చేసే కొత్త స్కెచ్

కేంద్రంలో కొత్త ఫ్రంట్ : బీజేపీని ఒంటరి చేసే కొత్త స్కెచ్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

2024లో బీజేపీని ఎదుర్కోవాలంటే సింహం సింగిల్‌గా వస్తుందనే సినిమాటిక్ డైలాగ్స్ వర్క్‌ఔట్ కావు. ఈ విషయం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వరకూ అంతరికీ తెలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. అందుకే, ఇప్పటివరకూ అంటీముట్టనట్టు, జనంతోనే పొత్తులంటూ వ్యవహరించిన పార్టీ లు సైతం పిడికిలి బిగిద్దాం, కలిసినడుద్దాం, కమలాన్ని ఢీకొందాం అంటూ పిలుపునిస్తున్నాయి. ఈ ఐక్యత ప్రయత్నాలు గతంలోనూ జరిగినా ఈ స్థాయిలో మాత్రం ఇప్పుడే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హస్తం పార్టీ అందరినీ ఏకం చేసేందుకు ఏం వదులుకోడానికైనా సిద్ధం అనే సంకేతాలిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వదులుకునేంత సాహసం చేయకపోవచ్చు. ఈ విషయం అటుంచితే.. విపక్షాల ఐక్యతలో ఇటీవల జరిగిన పరిణామాలు దేశం మొత్తం చూస్తూనే ఉంది. గతేడాదిగా కాంగ్రెస్‌ లేని ఫ్రంటా.. దాంతో ఏ సాధిస్తారంటా అంటూ వస్తున్న బిహార్ సీఎం తాజాగా హస్తంతోపాటే అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దదీన్లో భాగంగానే ఢిల్లీ టూరేసి కాంగ్రెస్‌ అధినాయకత్వం నుంచి వామపక్షాల వరకూ బీజేపీ మాటెత్తితే శివాలెత్తిపోయేవారెవరినీ విడిచిపెట్టకుండా వరుస భేటీలు నిర్వహించారు. ఆ భేటీల రిజల్ట్ ఏంటనే ప్రశ్నకు కాలం సమాధానం ఇస్తుంది. కానీ, నితీశ్ యాక్షన్ ఇప్పు డే ఎందుకనే ప్రశ్నకు మాత్రం ఓ సమాధానం పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్‌తో కలిసి నడిస్తే బీజేపీని ఓడించడం సాధ్యం అన్న ఒకే ఒక్క మాటను నితీశ్ ఎప్పట్నుంచో వినిపిస్తున్నారు. కానీ, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మాత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇటీవల ఇచ్చిన షాకుల తర్వాతే. విపక్షాలన్నీ అదానీ ఎపిసోడ్‌ను బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటే.. ఈ అంశాన్ని తప్పుపట్టిన పవార్ అందరి ఆశలపై నీళ్లు చల్లేసారు. విపక్షాలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి సుముఖంగా ఉన్న పవారే అదానీని వెనకేసుకు రావడం, మోడీడిగ్రీ అసలు మ్యాటరే కాదనడం లాంటి పరిణామాలు హస్తం పార్టీతో పాటూ బీజేపీయేతర పార్టీలన్నింటికీ టెన్‌థౌజండ్‌ ఓల్ట్స్‌ షాకిచ్చింది. ఫలితంగా జనంలోకి బలంగా వెళుతున్న విపక్షాల ఐక్యత ఎపిసోడ్‌ మళ్లీ క్వశ్చన్ మార్క్‌ దగ్గరే ఆగిపోయే పరిస్థితికొచ్చింది. ఆ సమయంలో విపక్షాల ఐక్యత మాట పొలిటికల్ కామెడీగా మారుతుందా అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నితీశ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. విపక్షాల ఐక్యత అంశంలో శరద్ పవార్ వ్యాఖ్యల ప్రభావం పడకూడదంటే జరగాల్సింది ఇదే. అందుకే నితీశ్ రంగంలోకి దిగారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది.
ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. విపక్షాల ఐక్యత సాధన కోసం నితీశ్ చేసిన గ్రౌండ్‌వర్క్‌ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నీ కుదిరి విపక్షాల మధ్య ఐక్యత అంటూ సాధ్యమయితే.. వాట్ నెక్స్ట్ అనేదానిపై నితీశ్‌ పక్కా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ నెల 12న జరిగిన సమావేశంలో నితీశ్ ప్రతిపాదించిన ఫార్ములా “వన్ సీట్.. వన్ క్యాండిడేట్”. మోడీ బ్రాండ్‌తో తిరుగులేని శక్తిగా మారిన కమలం పార్టీని ఓడించాలన్నా.. కనీసం ఓటమిభయం చూపించాలన్నా ఇలాంటి ఫార్ములాను ఫాలో ఐతేనే
సాధ్యం అని నితీశ్ చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఉన్న అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీష్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్ ఈ ఫార్ములాను తెరపైకి తేవడంవెనుక కారణం లేకపోలేదు.
ఒకవేళ విపక్షాల ఐక్యత అంటూ సాధ్యపడితే.. “వన్ సీట్.. వన్ క్యాండిడేట్” లాంటి ఫార్ములా వాటికి కచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవడంలో విపక్షాలు ఏకమయినా ఆయా స్థానాల్లో సీట్ల కేటాయింపులు చేసి ఎవరికి వారు పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అదే విపక్షాలందరి నుంచీ ఒక్కరే అభ్యర్ధి బరిలో నిలిస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తే ఉండదు.
ఫలితంగా విపక్షాలు ఆశించిన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట. అయితే, “వన్ సీట్.. వన్ క్యాండిడేట్” ఫార్ములా కూడా కొత్తదేం కాదు. గతంలోను విపక్షాలు ఈ ఫార్ములాను ఫాలో అయ్యాయి. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు చేతులు కలిపాయి. 1977, 89ల్లో కాంగ్రెస్‌ను విపక్షాలన్నీ ఏకమై ఇలాగే ఎదుర్కొని ఓడించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, వాటి ఐకమత్యం మూణ్ణాళ్ల ముచ్చటే అయిందని.. రెండేళ్లకే మళ్లీ చీలికలు పేలికలు అయిపోయాయని.. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేస్తున్నారు. మరి అలాంటి ఫార్ములా ఇప్పుడు మాత్రం ఎలా వర్క్‌ఔట్ అవుతుందనే చర్చకూడా లేకపోలేదు. అయితే, నితీశ్ తెరపైకి తెచ్చిన ఫార్ములా ఆచరణలోకి రావాలంటే ముందు విపక్షాల మధ్య ఐక్యత అంటూ వస్తేనే సాధ్యమయ్యేది. ఇప్పుడు ఆ బాధ్యతలు నెత్తినేసుకుంది నితీశ్ కుమారే.
విపక్షాల ఐక్యత బాధ్యతనయితే నితీశ్ తలకెత్తుకున్నారు కానీ అదెంతవరకూ సాధ్యం అవుతుందనేది ఇప్పటికీ మిలియన్ మార్క్ ప్రశ్నే. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ. రాహుల్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెడితే, కాంగ్రెస్ నాయకులకు, మిత్ర పక్షాలకు సైతం రాహుల్ నాయకత్వం పై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నరనరాల్లో కాంగ్రెస్ రక్తం నింపుకున్న కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్, కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్వతంత్ర సమర యోధుడు చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు సి.ఆర్ కేశవన్ వారం రోజుల గ్యాప్‌లోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీని వీడి కమలం కండువా కప్పుకోవడమే. నిజానికి.. ఈ ముగ్గురు మాత్రమే కాదు, కపిల్ సిబల్, గులామ్ నబీ ఆజాద్, చౌదరి బీరేంద్ర సింగ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి ఎందరో సీనియర్ లీడర్లు కాంగ్రెస్ ను వీడారు. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదని పార్టీని వీడినవారే.
మరోవైపు.. అదానీ వ్యవహారంలో రాహుల్ తీసుకున్న స్టాండ్‌తో విభేదించి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమత కాంగ్రెస్‌కు దూరంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తాను సావర్కర్‌ను అవమానిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ శివసేన సైతం భగ్గుమంటోంది. ఇలా ఇప్పటివరకూ ఉన్న మిత్రపక్షాలే కాంగ్రెస్‌తో కలిసేందుకు కాదంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే సోనియా సైతం మళ్లీ తెరపైకి వచ్చి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలనే పిలుపు ఇచ్చారు. కానీ, రాహుల్‌ నాయకత్వంలో కలిసి పని చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. అందుకే, విపక్షాల ఐక్యతకు రాహులే అవరోధం అనే అభిప్రాయం బలపడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సమయంలో నితీశ్ కుమారే కాదు సోనియా గాంధీనే రంగంలోకి దిగినా ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం అనే చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి ప్రతికూలతలను దాటుకుని విపక్షాల ఐక్యత ఎంత వరకూ సాధ్యపడుతుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...