టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 2017 లో విడుదలైన జయ జానకి నాయక సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లో 709 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. యూట్యూబ్ లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాగా వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నట్టు సినిమా మేకర్స్ ద్వారకా క్రియేషన్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రూపొందించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఫుల్ యాక్షన్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేయగా.. ఆశించిన మేర ఆడలేదు. కానీ యూట్యూబ్ లో మాత్రం దూసుకెళ్తోంది. ఖూన్ఖర్ పేరుతో యూట్యూబ్ లో విడుదలైన హిందీ వర్షన్ ఏకంగా 709 మిలియన్ వ్యూస్ తో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన ఛత్రపతిని హీందీలో రీమేక్ చేస్తుండగా.. ప్రభాస్ క్యారెక్టర్లో బెల్లంకొండ నటిస్తున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తెలుగు ఛత్రపతి సినిమాకు దర్శకత్వం వహించింది ఎస్ ఎస్ రాజమౌళి కావటం.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకోవటంతో.. ఛత్రపతి హిందీ వర్షన్ పై భారీ ఆసక్తి నెలకొంది.