సంక్రాంతి పుంజు ఎవరో తెలిసిపోయింది
సంక్రాంతి బరిలో నిలిచిన ఇద్దరు స్టార్ హీరోలు బాలయ్య చిరంజీవి జాయింట్ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. చిరంజీవి కంటే రెండు రోజులు బరిలో దిగిన బాలయ్య ఓపెనింగ్స్ లో రికార్డులు బద్దలు కొట్టగా.. లేట్ గా వచ్చిన చిరంజీవి సినిమా బాలయ్యను మించి రేటింగ్ సాధించినట్టు కనిపిస్తోంది. ఊర మాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించినా.. వీరసింహారెడ్డి కంటే మాస్ ప్లస్ బాస్ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్యలో ఎంటర్టైన్మెంట్ డోస్ కాస్త ఎక్కువగా ఉందని టాక్.
బాలయ్య సినిమా సెకండ్ హాఫ్ లో పూనకాలు తెప్పించే సీన్లు ఉండగా.. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజ మధ్య హై ఓల్టేజ్ వార్ కూడా పూనకాలు తెప్పించే రేంజ్ లోనే ఉందట. అయితే.. వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య సినిమాకు ఓ పాయింట్ ఎక్కువగా రేటింగ్ రావటానికి కారణం.. చిరంజీవికి రవితేజ తోడు కావటమే అని సోషల్ మీడియాలో జనాలు రివ్యూలు చెప్తున్నారు. మొత్తానికి అటు బాలయ్య.. ఇటు చిరంజీవి.. ఇద్దరూ సంక్రాంతి సీజన్లో జనాన్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్ బద్దలు కొట్టేయటం.. టాలీవుడ్ కు బిగ్ బ్రేకింగ్. ఇక.. అటు ధమాకాతో పాటు ఇటు వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటం.. రవితేజకు డబుల్ కిక్.. ఫ్యాన్స్ కు కూడా డబుల్ కిక్కే.