లైగర్ తో డీలా పడిపోయిన మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లో బాలయ్యతో మరో సినిమా అనౌన్స్ చేశాడు పూరీ. కాకపోతే.. ఇక్కడే పూరీ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ను రామ్ పోతినేనితో కాకుండా బాలయ్యతో చేస్తున్నాడట. బాలయ్యతో సినిమా ఉందని చెప్పాడే కానీ.. రామ్ కోసం సిద్ధం చేసిన కథను బాలయ్య కోసం మార్చేసి ట్విస్ట్ ఇస్తాడని ఊహించలేదు. ఇస్మార్ట్ శంకర్ ఓ యంగ్ ఆండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మరి అలాంటి కథను ఎంత మార్చినా బాలయ్య కోసం పనికొస్తుందా అనేది బాలయ్య అభిమానుల డౌట్.
పైసా వసూల్ సినిమాతో బాలయ్య బాబును మరో రేంజ్ కు తీసుకెళ్ళిపోయాడు పూరీ. ఇదివరకెప్పుడూ కనిపించని లుక్ మరియు క్యారెక్టర్ లో బాలయ్య ఊర మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పూరీ-బాలయ్య కాంబినేషన్ బాలయ్య మాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు పూరీ ఇచ్చిన అప్డేట్ షాకిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్నాడే కానీ.. దాని కథ ఏమిటి.. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. ఇలాంటి విషయాలేవీ రివీల్ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.