నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తారక్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందనీ.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారనీ బాలయ్య అప్డేట్ ఇచ్చారు. కుప్పం కేసీ హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులో లేదని చెప్పిన బాలయ్య.. మెరుగైన వైద్యం కోసం ఆంబులెన్స్ లో తారకరత్నను బెంగళూరు తరలిస్తున్నామన్నారు. ప్రస్తుతం తారకరత్న వెంటనే తాను ఉన్నాననీ.. ప్రతి 10 నిముషాలకు ఓసారి డాక్టర్ల నుంచి హెల్త్ అప్డేట్ తీసుకుంటున్నాననీ బాలయ్య చెప్పాడు.
అతడి హార్ట్ బీట్ ప్రస్తుతానికి బాగానే ఉంది అనీ.. ఐసీయూ నుంచి బయటకు తీసుకు వచ్చేంత మెరుగైన తర్వాత అన్ని సౌకర్యాలున్న ఆంబులెన్స్ లో బెంగళూరు తరలించాల్సి ఉందని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో ఒత్తిడికి గురై కార్డియాక్ అరెస్టుకు గురైన విషయం తెలిసిందే.