HomeFILM NEWSజనానికి కోపం తెప్పిస్తున్న ఔం రౌత్ కామెంట్లు

జనానికి కోపం తెప్పిస్తున్న ఔం రౌత్ కామెంట్లు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

500 కోట్లు ఖర్చు పెట్టి ఇదా నువ్వు తీసిన సినిమా అంటూ జనాలు ఓ వైపు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై విరుచుకుపడుతుంటే.. అతడు మాత్రం తాపీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రామాయణాన్ని తనకు ఇష్టమొచ్చినట్టు మార్చేసి అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు ఎక్కడో మండేలా చేసిన ఇతడు.. డైరెక్టర్ నితేష్ త్వరలో మొదలు పెట్టనున్న రామాయణం ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తితో ఉన్నాననీ.. తన లాంటి రామ భక్తులంతా రామాయణాన్ని ఎన్ని సార్లైనా చూసేందుకు ఇష్టపడతారనీ వ్యాఖ్యానించాడు. తనను తాను రామభక్తుడిని అని చెప్పుకోవటం పట్ల జనాలు మరోసారి భగ్గుమన్నారు. “సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా జస్టిఫికేషన్ కనిపించలేదు.. కనీసం శ్రీరాముడి పాత్రను కూడా అవెంజర్స్ హీరో లాగా చూపించి నాశనం చేశాడు” ఓం రౌత్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అవెంజర్స్, అవతార్ లాంటి సిరీస్ లు రామాయణాన్ని, మహాభారతాన్ని బేస్ చేసుకొని తీస్తే.. ఓం రౌత్ మాత్రం రామాయణాన్ని అవెంజర్స్ లా చూపించాడట.
సోషల్ మీడియాలో ఈ పోలిక ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ లో చూపించిన లంక.. థోర్ సినిమాలోని ఆస్గార్డ్ కు కాపీలా ఉంది. అలాగే ఆదిపురుష్ లో చూపించిన రాక్షసుల క్యారెక్టర్లు అన్నీ అవెంజర్స్ సినిమాల్లో కనిపించే వాటిలాగానే డిజైన్ చేశాడు ఓం రౌత్.. కాదు కాదు కాపీ చేశాడు. ఇదొక్కటే కాదు.. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లోని క్యారెక్టర్లన్నీ కలిపి చిత్రవిచిత్రమైన మార్పులు చేసి వాటిని ఆదిపురుష్ లో చూపించేశాడు ఈ డైరెక్టర్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచమంతా భారత ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని సినిమాలు రాసుకుంటున్నారు. ఓం రౌత్ మాత్రం అలా రాసుకుని ఇంగ్లిష్ లో తెరకెక్కించిన సినిమాలను మళ్ళీ కాపీ కొట్టి ఇండియన్ సినిమా అంటున్నాడు. ఇన్ని విమర్శలు వస్తున్నా, ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా ఓం రౌత్ మాత్రం హ్యాప్పీగా మిగతా డైరెక్టర్ల సినిమాల గురించి ఎదురు చూస్తున్నానంటూ రిలాక్స్ అవుతున్నాడు. రెండో రోజు నుంచే కలెక్షన్లు డల్ అయిపోగా.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

FOLLOW US

More like this