సెల్ఫీ ఇవ్వనందుకు టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా పై కొంత మంది దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. షా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిలో ముంబైకి చెందిన నటి కూడా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సప్నా గిల్ అనే అమ్మాయి ఈ గ్యాంగ్ లో మిగతా వారితో కలిసి షా పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. భోజ్పురి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. మిగతా వారికి సెల్ఫీ ఇచ్చి తనకు ఇవ్వలేదన్న కోపంతో షా పై దాడి చేసింది. బుధవారం నాడు పృథ్వీ షా తన ఫ్రెండ్స్ తో కలిసి ముంబైలోని శాంటాక్రూజ్ లోని ఓ హోటల్ కు వెళ్ళాడు. లోనికి వెళ్తుండగా కొంత మంది ఎదురుపడి తమకు సెల్ఫీ ఇవ్వాలని కోరారు. ఇద్దరితో సెల్ఫీ దిగిన పృథ్వీ షా మిగతా వారితో సెల్ఫీ దిగకుండా తన కోసం తన ఫ్రెండ్స్ ఎదురుచూస్తున్నారంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళు షా గో వాదనకు దిగారు. హోటల్ సిబ్బందికి విషయం చెప్పగా వాళ్ళు ఈ గ్యాంగ్ ను బయటకు పంపించేశారు. వీరిలో సప్నా గిల్ కూడా ఉంది. బయట షా కోసం కాపు కాసిన ఈ గ్యాంగ్.. పృథ్వి షా హోటల్ నుంచి బయటకు సప్నా గిల్ తన గ్యాంగ్ తో కలిసి దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదర్ గ్యాంగ్ లోని వ్యక్తులు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తనపై దాడి చేసిన వారిపై షా తన ఫ్రెండ్స్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.