HomeINTERNATIONAL NEWSటర్కీ, సిరియాల్లో దారుణమైన పరిస్థితులు

టర్కీ, సిరియాల్లో దారుణమైన పరిస్థితులు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో మృత్యుమృదంగం ఆగటం లేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి 3 సార్లు భారీ భూకంపాలు సంభవించగా.. మంగళవారం ఉదయం నాటికి కనీసం 100 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టర్కీ, సిరియా దేశాల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కోనిదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ప్రకృతి విలయతాండవంలో 5 వేల మందికి పైగా మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే శిథిలాల కింద మరో 20 వేల వరకు ఇరుక్కుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత 30 గంటలుగా సుమారు 100 సార్లు భూప్రకంపనలు సంభ‌వించాయనీ.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతకు తగ్గకుండా ఈ ప్రకంపనలు ఉన్నాయనీ జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు.
భూకంపం తీవ్రతకు టర్కీలోని ఇసికందరన్ పోర్టు తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన కంటైనర్లలో అగ్నిప్రమాదం సంభవించి కంటైనర్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ సరఫరా పైప్ లైన్లు తీవ్రంగా ధ్వంసం కావటంతో ప్రభుత్వం గ్యాస్ సరఫరాను నిలిపివేసి ముబైల్ ప్లాంట్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తోంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. భూకంపానికి తోడు అగ్ని ప్రమాదాలు టర్కీని అతలాకుతలం చేస్తున్నాయి. సహాయ చర్యలు చేపట్టినప్పటికీ ఏమాత్రం సరిపోవటం లేదు. మొదటి భూకంపం సంభవించి ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినా.. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు. అటు భూప్రకంపనలు కూడా ఆగటం లేదు. మరిన్ని రోజులు ప్రకంపనలు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. మరింత తీవ్ర భూకంపం సంభవించే ఆస్కారం కూడా ఉందని చెప్పటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

FOLLOW US

More like this