HomeNATIONAL NEWSఅతీక్ హత్య వెనుక "పెద్ద తలకాయలు" - ప్రపంచానికి తెలియని నేర చరిత్ర

అతీక్ హత్య వెనుక “పెద్ద తలకాయలు” – ప్రపంచానికి తెలియని నేర చరిత్ర

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

అతీక్ అహ్మత్ మరియు అతడి తమ్ముడు అష్రఫ్ ల హత్య తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ నడుస్తోంది. కేవలం ఇద్దరు రౌడీ షీటర్ల హత్యతో రాష్ట్రం మొత్తం షేక్ అయిపోవటం.. సీఎం యోగి స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండటం చూస్తుంటే ఈ హత్య వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నదని భావించవచ్చు. అయితే.. ఇంతకూ ఎవరు ఈ అన్నదమ్ములు.. ఏం చేసేవారు.. ఎందుకు హత్య చేయబడ్డారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే పెద్ద చరిత్రనే తవ్వి చూడాలి.
హత్యకు గురైన అతీక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. కానీ అప్పటి నుంచే అతీక్ నేరాలకు పాల్పడేవాడు. పదవిని అడ్డు పెట్టుకొని సుపారీ హత్యలు, కిడ్నాప్ లు చేయటమే అతీక్ మరియు అతని అనుచరుల ప్రధాన వృత్తి. తనపై పోటీ చేసి తనను ఓడించాడన్న కోపంతో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ ను 2005లో హత్య చేసినప్పటి నుంచి అతీక్ కు కష్టకాలం మొదలైంది. ఇదే కేసులో జైలు శిక్ష అనుభవించిన అతీక్.. ఇటీవల ఇదే కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ ను హత్య చేయించాడు. ఈ హత్యలో అతీక్ తమ్ముడు అష్రఫ్ తో పాటు కొడుకు అసద్ కీలక పాత్ర పోషించారు. ఉమేశ్ పాల్ హత్యతో ఉత్తర్ ప్రదేశ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. యోగీ సర్కార్ పై తీవ్ర విమర్శలు రావటంతో సీఎం పోలీసులకు ఎన్ కౌంటర్ చేయాలని ఆదేశించాడు. దీంతో అతీక్ గ్యాంగ్ కు మూడింది. ఉమేశ్ పాల్ హత్యతో ప్రమేయమున్న అతీక్ అనుచరులు ఒక్కొక్కరుగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. మొదట అర్బాజ్ ను హతమార్చిన పోలీసులు ఆ తర్వాత అతీక్ సోదరుడైన అసద్ తో పాటు గులామ్ ను కూడా ఎన్ కౌంటర్లో కాల్చి చంపారు. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే అతీక్, అష్రఫ్ హత్యకు గురయ్యారు.
అతీక్ అహ్మద్, ఆష్రఫ్, అసద్, అర్బాజ్, గులామ్.. వీళ్ళంతా ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్లు మాత్రమే అని తొలుత భావించారు. కానీ వీరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలున్నట్టు పోలీసులు తర్వాత గుర్తించారు. లష్కర్ ఇ తయ్యబా తీవ్రవాద సంస్థతో లావాదేవీలు ఉండటమే కాకుండా పాకిస్తాన్ నుంచి అక్రమ ఆయుధాల రవాణా, తీవ్రవాదులకు సహకారం, సుపారీ హత్యలు చేయటం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయటం ఇలా చాలా పెద్ద నెట్ వర్క్ కలిగి ఉన్నారు. యూపీలో చీకటి వ్యాపారాలు చేసే చాలా మంది పెద్ద మనుషులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధాలున్నాయి. రౌడీయిజం ముసుగులో ఈ గ్యాంగ్ చేసిన నేరాల చిట్టా చాలా పెద్దదే. ఉమేశ్ పాల్ హత్యతో ఈ గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ పోలీసులు హతమారుస్తూ వచ్చారు. అతీక్ ను మాత్రం చంపకుండా వాళ్ళ నెట్ వర్క్ మొత్తం సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అందుకే అతీక్, అష్రఫ్ లను కోర్టు ముందు హాజరు పరిచి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించాలనేది పోలీసుల ప్లాన్. అయితే.. అతీక్ అరెస్ట్ అయిన నాటి నుంచీ భయపడుతూనే ఉన్నాడు. అందుకే.. తనను ఉత్తర్ ప్రదేశ్ తీసుకెళ్ళవద్దనీ.. తీసుకెళ్తే తనను చంపేస్తారంటూ మొత్తుకున్నాడు. యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనేది అతీక్ భయమని అందరూ అనుకున్నారు. కానీ అతీక్ కు తెలిసింది వేరు. తన గ్యాంగ్ తో హత్యలు చేయించిన వాళ్ళు లేదా పాకిస్తాన్ తో సంబంధాలున్న వాళ్ళు ఖచ్చితంగా తనను చంపేస్తారనేది అతీక్ భయం. అతీకు కొడుకు అసద్, గులామ్ లను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపిన తర్వాత అతీక్ మీడియా ముందు ఓ మాట అన్నాడు. తన కుటుంబంలోని అందరూ చావటానికి తానే కారణమయ్యానంటూ బహిరంగంగానే బాధను వ్యక్తం చేశాడు. ఇలా వైరాగ్యం ఆశ్రయించిన వాళ్ళు ఎక్కువ కాలం పోలీసుల ముందు నిజాలను దాచాలని అనుకోరు. అంతా అయిపోయాక చేసేదేమీ లేదనే భావనలో అన్ని నిజాలు పోలీసులకు చెప్పి అప్రూవర్ గా మారిపోతారు. ఈ సంగతి అర్థం చేసుకున్న ఎవరో పెద్ద మనుషులు.. తమ పేర్లు బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేయించారు. హత్యకు పాల్పిన ముగ్గురి పేర్లు లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య. తిండికి గతిలేని పేద వాళ్ళకు డబ్బు ఆశ చూపి మూడు రోజుల పాటు తుపాకీతో కాల్చడంలో శిక్షణ ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ప్రయాగ్ రాజ్ లోని అతీక్, అష్రఫ్ లు ఉన్న హాస్పిటల్ వద్దకు చేరుకొని అతి దగ్గరి నుంచి కాల్చి చంపేశారు. ఆ తర్వాత విషయం పక్కదారి పట్టించేందుకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అలా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ అతిపెద్ద గ్యాంగ్ అంతమైంది.
హత్య చేసి తుపాకులు కింద పడేసి చేతులు పైకెత్తి ముగ్గురు నిందితులు లొంగిపోయారు. అంటే.. హత్య చేసి జైలుకు వెళ్ళేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారన్నమాట. పోలీసుల విచారణలో హత్య ఎందుకు చేశారని ప్రశ్నిస్తే.. తమ పేర్లు రాష్ట్రంలో మార్మోగి పోవాలని చేశామంటూ సమాధానమిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన ఓ టాస్క్ ను గుడ్డిగా పూర్తి చేశారే తప్ప వీళ్ళకు ఎలాంటి సమాచారం తెలియదు. ఇక ఈ హత్య చేసి జైలుకు వెళ్ళటానికి బహుశా వారి కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి ఉండాలి. ఏదేమైనా.. కేవలం రౌడీ షీటర్లు అనే పేరుతో పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కర్ ఇ తయ్యబా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకొని ఎన్నో నేరాలు చేసిన అతీక్ గ్యాంగ్ ను చివరికి ఆ తీవ్రవాదమే బలి తీసుకుంది. చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన ఎవరైనా సరే.. అదే చీకటికి బలి కాక తప్పదనేది ఈ గ్యాంగ్ అంతంతో మరోసారి నిజమైంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...