ప్రస్తుతం తెలుగులో టాక్ షోల హవా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ స్టాపబుల్ తో నందమూరి బాలకృష్ణ ఇండియా లెవెల్ రేటింగ్ తో తెలుగోడి టాక్ షో సత్తా చాటగా.. ఇప్పుడు అదే బాటలో మరో భారీ టాక్ షో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. హాయ్ రబ్బా అంటూ రీమిక్స్ తో తెలుగులో పాప్ ట్రెండ్ సెట్ చేసిన సింగర్ హాయ్ రబ్బా స్మిత ఈ టాక్ షో లో హోస్ట్ గా కనిపించబోతోంది. “నిజం విత్ స్మిత” పేరుతో వస్తూ వస్తూనే ఈ టాక్ షో భారీ షాకే ఇచ్చింది. ఇంత కాలం చడీ చప్పుడూ లేకుండా ఎపిసోడ్లన్నీ షూట్ చేసేశారు. గెస్టుల లిస్టు కూడా మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హీరో నాని, రాణా, సాయి పల్లవి, అడవి శేషు, డైరెక్టర్ దేవా కట్టా.. ఇలా చాలా పెద్ద వీఐపీ గెస్టుల లిస్టే ఉంది.
ఈరోజే ఈ టాక్ షో కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. స్మిత కూడా తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ టాక్ షో ప్రోమోను షేర్ చేసింది. ఇప్పటి దాకా షూట్ చేసిన అన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన చిన్న చిన్న కట్స్ తో ప్రోమో రూపొందించారు. మోస్ట్ ఇంట్రస్టింగ్ ప్రశ్నలు.. వాటికి గెస్టులు ఇస్తున్న మోస్ట్ ఇంట్రస్టింగ్ సమాధానాలతో ప్రోమో కూడా మోస్ట్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. ఇంత పెద్ద టాక్ షో చేస్తూ కూడా ఎక్కడా ఏ లీక్ జరగకుండా బాగానే జాగ్రత్తపడ్డారు షో మేకర్స్. మొత్తానికి టాలీవుడ్ ను షేక్ చేయటానికి మరో టాక్ షో రెడీగా ఉందన్నమాట. నిజం విత్ స్మిత ఏ రేంజ్ లో రేటింగ్స్ సాధిస్తుందో.. ఏ రేంజ్ లో జనాన్ని అలరిస్తుందో చూడాలి.