టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా సినిమా థియేటర్ బిజినెస్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అమీర్ పేట్ సత్యం థియేటర్ ను ఏఏఏ మల్టీప్లెక్స్ గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ మరో భారీ మల్టీ ప్లెక్స్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడని టాలీవుడ్ టాక్. వైజాగ్ బీచ్ కు దగ్గర్లో స్థలాన్ని అల్లు అర్జున్ కొనుగోలు చేశాడనీ.. ఇందులో మల్టీప్లెక్స్ కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కు విశాఖపట్నం అంటే కాస్త సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలో వైజాక్ కనిపిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని అల్లు అర్జున్ నమ్మకం. ఇక వైజాగ్ లో బిజినెస్ చేస్తే కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మే బన్నీ.. తన సెంటిమెంట్ ప్రకారమే వైజాగ్ లో స్థలం కొనుగోలు చేసి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ రాజధానిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వైజాగ్ మరింత డెవలప్ కావటం ఖాయమని భావించిన బన్నీ.. మల్టీప్లెక్స్ నిర్ణయం తీసుకున్నాడట.
చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే తమ సంపాదనతో కొత్త వ్యాపారాలను ప్రారంభించటం మనం చూసాం. రెస్టారెంట్లు, హోటల్స్, జిమ్ సెంటర్స్, జువెలరీ షాప్స్.. ఇలా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తుపై శ్రద్ధ పెడుతున్నారు. మహేష్ బాబు కూడా ఏఎంబీ పేరుతో థియేటర్ వ్యాపారంలోకి ఎప్పుడో అడుగుపెట్టేశాడు. మిగతా వ్యాపారాల కంటే థియేటర్ బిజినెస్ బెస్ట్ అనేది అల్లు ఫ్యామిలీ ఒపీనియన్. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ ఫిల్మ్ ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక థియేటర్ల చైన్ ఒకటి కూడా విస్తరిస్తే బాగుంటుందని బన్నీ భావించి ఉంటాడు. భవిష్యత్తులో మరిన్ని మల్టీప్లెక్స్ లు బన్నీ నిర్మించటం ఖాయంగా కనిపిస్తోంది.