HomeINTERNATIONAL NEWSచైనాకు షాకిచ్చిన అజిత్ ధోవల్ కొత్త డీల్

చైనాకు షాకిచ్చిన అజిత్ ధోవల్ కొత్త డీల్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

అజిత్ దోవల్.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కంటే ఇండియన్ స్పైగా ప్రపంచానికి పెద్దగా పరిచ యం అక్కర్లేని వ్యక్తి. ఈయన వ్యూహానికి కరుడుగట్టిన టెర్రరిస్టు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అజిత్ దోవల్ ఎత్తులేస్తే ఎలాంటి శత్రుదేశాలైనా చిత్తవ్వక తప్పదు. అలాంటి సీక్రెట్ ఏజెంట్ ఇండియాకు సెక్యూరిటీ అడ్వైజర్ ఐతే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అజిత్ దోవల్ యాక్షన్ కూడా అదే రేంజ్‌లో కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లో తోక జాడిస్తున్న డ్రాగన్‌ కోసం దోవల్ రంగంలోకి దిగిపోయారు. చైనాను ఎక్కడ కొడితే దారికొస్తుందో అక్కడే కొట్టారు. శత్రువుకు శత్రువు మిత్రుడే కదా? ఇప్పుడీ ఫార్ములానే అజిత్ దోవల్ ఫాలో అయ్యారు. అగ్రరాజ్యంలో మూడు రోజులు పర్యటించి.. బీజింగ్‌కు కంటిమీద కునుకు రాకుండా చేస్తున్నారు. అందుకే, దోవల్ అమెరికా టూర్‌పై డ్రాగన్ కన్నింగ్ కామెంట్లు షురూ చేస్తోంది.
సెమీకండక్టర్‌ వార్.. నిజానికి, చాలాకాలంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఇప్పుడు ఈ వార్‌లోకే ఇండియా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి డ్రాగన్ దేశానికి భారత్‌ దెబ్బేంటో రుచిచూపించేందుకు సిద్ధమైపోయింది. అయితే, ఈ కొత్త యుద్ధంలో ఇండియా దూకుడు తెలుసుకునేముందు.. సెమీకండక్టర్ల గురించి తెలుసుకోవాలి.
ప్రస్తుత హైబ్రిడ్ ప్రపంచంలో సెమీకండక్టర్‌‌దే కీ రోల్. చేతికుండే వాచ్ దగ్గర నుంచి శత్రు దేశంపై సంధించే ఆటం బాంబ్‌ వరకూ.. ప్రతి వస్తువూ ఇది ఉంటేనే నడుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకు గుండె ఎంత కీలకమో.. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో సెమీకండక్టర్ చిప్ పాత్ర అంత కీలకమన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో వీటి కొరత అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు.. కోవిడ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో సప్లై చైన్ లింక్‌ తెగిపోవడం.. అన్నింటికీమించి తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు. ఇలా చాలానే కారణాలున్నాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్లను సౌత్‌ కొరియా, జపాన్‌, చైనా, తైవాన్‌ దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి. భవిష్యత్‌లో సెమీకండక్టర్లతోనే ప్రపంచాన్ని శాసించొచ్చనేది బీజింగ్‌ ఆలోచన. నిజమే.. చైనా లాంటి కన్నింగ్ కంట్రీ సెమీకండక్టర్‌ ఇండస్ట్రీలో కింగ్ అయితే ప్రపంచానికి అసలైన తలనొప్పి
మొదలయ్యేది అప్పుడే. అందుకే, ఈ విషయంలో డ్రాగన్ ప్రతీ యాక్షన్‌కూ అగ్రరాజ్యం అమెరికా కౌంటర్ ఇస్తోంది. అడుగుముందుకు వేయనీయకుండా అడ్డుకుంటూ వస్తోంది. ఇప్పడు ఇందులో భాగంగానే భారత్ ను వెల్‌కమ్ చేసింది. ఈ మొత్తం ఒప్పందం జరిగింది నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్‌ సమక్షంలో. ఇక్కడే డ్రాగన్‌కు కడుపులో మంట మొదలైంది.చైనాను కట్టడి చేయడానికి ఐసీఈటీ ఒప్పందం చేసుకొన్నారా అన్న ప్రశ్నలకు వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియర్‌ స్పందించారు. భౌగోళిక రాజకీయ కోణాన్ని విస్మరించలేమనీ.. ఇది ఎవరినో ఉద్దేశించి చేసుకొన్న ఒప్పందం కాదని క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సులేవాన్‌ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ భారత్‌-అమెరికా సంబంధాల్లో ‘చైనాతో పోటీ’ అనేది ముఖ్య లక్షణంగా కనిపిస్తోందనీ.. కాకపోతే తమ బంధంలో భారత్‌ ఎదుగుదల గురించే.. ఆ ఎదుగుదలలో అమెరికా భాగస్వామ్యం గురించే ఎక్కువగా ఉందని వివరించారు. అయితే, చైనా ఆరోపణలు, అమెరికా క్లారిఫికేషన్లు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి అంశాల్లో ఇండియాకు కావాల్సినంత క్లారిటీ ఉంటుంది. అజిత్ దోవల్ సారధ్యంలో జరిగిన డీల్ అంటే.. దాని వెనుక ఎలాంటి వ్యూహం ఉంటుందో అంచనా వేయడం ఎవరికైనా అసాధ్యమే. నిజానికి.. సెమీకండక్టర్‌ ఇండస్ట్రీలో కింగ్‌ అవ్వాలన్నది ఇండియా ప్లాన్ కాకపోవచ్చు. కానీ, చైనాను మాత్రం ఇందులో ముందుకెళ్లకుండా చేయడంలో భారత్‌, అమెరికా ఒప్పందం కీలకం కాబోతోంది. ప్రస్తుతానికి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో తిరుగులేని దేశం తైవాన్‌.. ఆ తర్వాత సౌత్ కొరియా, జపాన్‌ కూడా ఉన్నాయి. ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలే. అందుకే సెమీకండక్టర్ ఇండస్ట్రీలో భారత్‌కు అమెరికాతో ఒప్పందం అత్యంత కీలకం.
నిజానికి.. ఇటీవలికాలంలో భవిష్యత్ టెక్నాలజీపై డ్రాగన్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అన్‌మ్యాన్డ్ వెపన్స్, ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సింగపూర్ టైమ్స్ నివేదిక విడుదల చేసింది. ఇలాంటి టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలంటే సెమీకండక్టర్‌ చిప్పులు ఉండాల్సిందే. ఇప్పుడు ఈ విషయంలో చైనాను అడ్డుకుంటున్న అమెరికాకు భారత్‌ తోడవ్వడంతో.. అంతర్జాతీయంగా కొత్త సరఫరా చైన్ లింక్ ఏర్పడే వీలుంటుంది. ఇప్పటికే భౌగోళికంగా ఇండియా.. చైనాకు ప్రత్యామ్నాయంగా మారింది. డ్రాగన్‌తో వాణిజ్యం చేస్తున్న చాలా దేశాలు.. దిగుమతుల కోసం ఇండియాను సంప్రదిస్తున్నాయి. ఇందుకే సెమీకండక్టర్ల అంశంలో తైవాన్, సౌత్‌ కొరియా, అమెరికా, భారత్‌లు ఒక్కటైతే.. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం. ఇదే సమయంలో సెమీకండక్టర్‌ ఇండస్ట్రీ హబ్‌గా భారత్‌ ఎదిగేందుకు కూడా తాజా డీల్ కలిసొస్తుంది. అదే జరిగితే భారత్ టెక్నాలజీ పరంగా బలపడడంతో పాటూ సరిహద్దుల్లో చైనాను నిలువరించే వీలుంటుంది. వీటన్నింటికీమించి అంతర్జాతీయ వాణిజ్యంలో బీజింగ్‌ను కోలుకోనీయకుండా చేయచ్చు. భారత్‌-అమెరికా ఒప్పందంలో ఇన్ని కోణాలు ఉన్నాయి కాబట్టే బీజింగ్‌ విమర్శలు చేస్తోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే భారత్-అమెరికా ఒప్పందం అజిత్ దోవల్ మార్క్‌ యాక్షన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే చైనా లాంటి కన్నింగ్ కంట్రీకి ఎలా చెక్ పెట్టాలో ఈ రియల్ హీరోకు తెలిసినంతగా మరెవరికీతెలియకపోవచ్చు. అందుకే దోవల్ నేరుగా యాక్షన్‌లోకి దిగినట్టు తెలుస్తోంది.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...