ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపురుష్ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు రెడీగా ఉందట. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో జరగబోతోందన్న విషయం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట సినిమా యూనిట్. ఈవెంట్ కు దర్శక దిగ్గజం రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడనీ.. రాజమౌళి చేతుల మీదుగానే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఆదిపురుష్ సినిమా పట్ల మొదట్లో నెగెటివ్ ఒపీనియన్ కనిపించినా.. ఆ తర్వాత మాడిఫికేషన్లు చేసి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసిన తర్వాత టాక్ మారింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమాలోని పాటలు.. ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. “ఇక నుంచి ప్రతి రామనవమి రోజున ఆదిపురుష్ పాటలే వినిపిస్తాయి” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ వెయ్యికోట్ల కలెక్షన్లే టార్గెట్ గా ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఇప్పటికే లోకల్, ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారో అన్ని భాషల్లోనూ ప్రమోషన్ స్పీడు పెంచింది ఆదిపురుష్ టీమ్. సినిమా రిలీజ్ కు 15 రోజులు కూడా లేకపోవటంతో సోషల్ మీడియాలో కూడా గట్టిగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఆదిపురుష్ చెరపలేని రికార్డులు క్రియేట్ చేయటం పక్కా అని సినిమా డైరెక్టర్ ఓం రౌత్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. వేల సంవత్సరాలుగా భారతీయులతో పాటు ప్రపంచానికి సుపరిచితమైన రామాయణ గాథను ఇదివరకు ఎప్పుడూ చూడనంత అద్భుతంగా తాను చూపించబోతున్నానని ఓం రౌత్ చెప్తున్నారు. విషయం ఏమిటనేది మరో 15 రోజుల్లో తెలిసిపోతుంది.