అనుకున్నట్టుగానే ఆదిపురుష్ సినిమా రికార్డులు బ్రేక్ చేయటం స్టార్ట్ చేసింది. మరోసారి ప్రభాస్.. బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసేశాడు. ఈ నెల 16 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆదిపురుష్ సినిమా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా వంద కోట్లు కలెక్ట్ చేయనున్నట్టు సినిమా ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. విడుదలైన ఫస్ట్ డే బాలీవుడ్ లోనే కనీసం 30 కోట్లు ఆదిపురుష్ వసూలు చేయటం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ లోనే ఇలా ఉంటే.. భారత దేశం మొత్తం ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సృష్టించబోతోందో అంకెలతో సహా వెల్లడించాయి సినిమా వ్యాపార వర్గాలు. అమెరికా వంటి దేశాల్లో భారత సినిమా ఫేస్ మారిపోయిన నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయట. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడి కథను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. సీతారాముల కథను వీక్షించేందుకు హిందువులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాల వారు హార్ట్ ఫుల్ గా ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి.
“అందరికీ తెలిసిన కథనే కదా రామాయణం.. ఇప్పటికే ఎన్నో సార్లు విన్నాం.. చూశాం.. ఇంకా ఏమిటి..” అంటూ ఆదిపురుష్ సినిమాపై నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా సినిమాకు టిక్కెట్లు బుక్ చేసేసుకున్నారట. విడుదలకు కేవలం కొద్ది గంటలే ఉండటంతో ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గోలనే కనిపిస్తోంది. ఓ వైపు ప్రభాస్ ఫ్యాన్స్.. మరో వైపు శ్రీరాముడి భక్తులు.. ఇలా అన్ని వర్గాల వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో ఆదిపురుష్ మరోసారి భారత దేశం గురించి ప్రపంచం ఆలోచించేలా చేయనున్నదనీ.. శ్రీరాముడి గొప్పతనం.. భారతదేశ పురాణాల విశేషాల గురించి మరోసారి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవటం మనం చూడబోతున్నామనీ సోషల్ మీడియా టాక్. బాహుబలి , బాహుబలి-2 తో గ్లోబల్ స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఈ సారి ఎన్ని రికార్డులు తన పేరున రాసుకోనున్నాడో చూడాలి.