HomeINTERNATIONAL NEWS4 లక్షల కోట్లు మాయం.. అదానీ ప్లేస్ కొలాప్స్

4 లక్షల కోట్లు మాయం.. అదానీ ప్లేస్ కొలాప్స్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

అనతికాలంలో అందలం.. అప్రతిహతంగా సాగుతున్న ప్రయాణం.. ప్రపంచ కుబేరుల్లో చోటుతో
ఇక తిరుగేలేదనుకుంటున్న వేళ.. అంతా తలకిందులైపోయింది. కోట్లాది రూపాయల సంపద, ఇన్వెస్టర్ల ట్రస్ట్ ఇలా ఒక్కటేంటి ఆల్మోస్ట్ అన్నింటిలోనూ వెనుకడుగులు పడ్డాయి. దీనంతటికీ కారణం ఒక్క రిపోర్ట్. ఒకే ఒక్క రిపోర్ట్ అదానీ గ్రూప్స్‌ని అథఃపాతాళానికి తొక్కేస్తోంది. ఆ రిపోర్ట్ ఒక్కరోజులోనే 87 వేల కోట్ల సంపదను ఆవిరిచేసేసింది. అదే ఒక్క రిపోర్ట్ ప్రపంచ కుబేరుల్లో ఒక్కరైనా అదానీని మూడో స్థానంలో నుంచి నాలుగుకు, నాలుగు నుంచి ఏడో స్థానానికీ లాగేసింది. గౌతమ్ అదానీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఆ రిపోర్ట్ ఇచ్చింది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ. ఇప్పుడు మార్కెట్‌లో ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.
ఈ నెల 25 వరకు ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ.. తాజాగా 7వ స్థానానికి పడిపోయారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్​ బిలియనీర్​ ట్రాకర్​ సూచిస్తోంది. ఆల్మోస్ట్ 19బిలియన్​ డాలర్ల సంపదను అదానీ కోల్పోయారు. ఈదంతా కేవలం మూడు రోజు ల గ్యాప్‌లో జరిగింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదానీ స్టాక్స్‌లో రక్తపాతం జరుగుతోంది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క రిపోర్ట్. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ కంపెనీ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ నెల 24న హిండెన్‌బర్గ్ అనే రీసర్చ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. న్యూయార్క్‌లోని హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 90 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అయితే, అది తొలిరోజు జరిగిన నష్టమే. కానీ, క్షణాలు గడిచేకొద్దీ అదానీ గ్రూప్‌ పరిస్థితి మరింతగా దిగజారిపోతోంది. ఈ సమయంలోనే అలర్ట్ అయిన అదానీ గ్రూప్. హిండెన్‌బర్గ్ గ్రూప్‌పై యాక్షన్ తీసుకుంటామని ప్రకటించినా సీన్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. ఇది సరిపోదన్నట్టు అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్‌ దీటైన కౌంటర్లిస్తోంది.
నిజానికి.. హిండెన్‌బర్గ్ సంస్థ షార్ట్-సెల్లింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే, ఒక కంపెనీ షేరు ధర పడిపోతుందనే అంచనా ఉన్నప్పుడు, ఆ షేర్లను అధిక ధరల వద్ద విక్రయించి, పడిపోయిన తర్వాత కొనడం అన్నమాట. అలాగే, భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్.. కమాడిటీస్ ట్రేడింగ్, ఎయిర్‌పోర్ట్స్, యుటిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. దీని యజమాని అయిన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు. అయితే, అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు గౌతమ్ అదానీ ఏడోస్థానానికి పడిపోయారు. అదానీని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎక్కడివరకూ లాగేస్తుందో అర్ధం కాని పరిస్థితి. హిండెన్‌బర్గ్ తన నివేదికలో కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసానికి అదానీ పాల్పడ్డారని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన సంస్థలలోని కొన్ని షేర్లను పబ్లిక్‌కు విక్రయించడానికి సిద్ధమైన వేళ ఈ నివేదిక వెలుగు చూసింది. పన్ను ఎగవేతదార్లకు స్వర్గధామాలుగా పిలిచే మారిషస్, కరీబియన్ వంటి దేశాల్లో అదానీకి ఉన్న కంపెనీల గురించి ఈ నివేదిక ప్రశ్నించింది. అంతేకాదు, ఈ కంపెనీకి భారీ రుణాలు ఉన్నాయని, అవి ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని కూడా ఈ నివేదిక హెచ్చరించింది. సింపుల్‌గా చెప్పాలంటే అదానీ గ్రూప్‌ అప్పుల కుప్పగా మారిందని బహిరంగంగా చెప్పిందన్న మాట.
మరోవైపు.. తాజా రిపోర్ట్‌పై అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్‌ మధ్య సవాళ్లు షురూ అయ్యాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థపై అమెరికా, భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. తాము ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని గౌతమ్ అదానీ చెప్పారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక భారత స్టాక్‌ మార్కెట్‌లో అలజడి సృష్టిస్తోందని, ఆ రిపోర్ట్ ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేస్తోందని అదానీ గ్రూప్ లీగల్ టీం హెడ్ జతిన్ జలంథ్‌వాలా అన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ చెబుతున్నది ఒక్కటే. తమ గ్రూప్ కంపెనీల షేర్ల విలువపై దుష్పభావం చూపించేందుకు నివేదికను డిజైన్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. తమ కంపెనీ షేర్లు పడిపోతే లబ్ధి పొందా లని చూస్తున్నట్టు హిండెన్‌బర్గ్ వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించింది. అయితే, ఈ విమర్శలకు హిండెన్‌బర్గ్ సంస్థ సైతం కౌంటర్‌ ఇచ్చింది. తమ నివేదికకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. తాము రిపోర్ట్ చేసి చాలా సమయం గడిచినప్పటికీ తమ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ నుంచి సరైన సమాధానం రాలేదంది. అలాగే, తమ రిపోర్ట్‌ను ముగించే ముందు అదానీ గ్రూప్‌ను 88 ప్రశ్నలు అడిగామనీ, వాటికి సమాధానం ఇవ్వడం ద్వారా తమ పారదర్శకతను నిరూపించుకునేందుకు అదానీ గ్రూప్‌నకు అదొక అవకాశమంది. చివరికి తమ సంస్థను అన్‌రీసెర్చ్‌డ్ అని కామెంట్‌ చేశారనీ.. తాము రెండు సంవత్సరాల పాటు పరిశోధించి 32 వేల పదాలు, 720 రెఫరెన్సులుతో 106 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తోనే అదానీ గ్రూప్‌ అతలాకుతలమైపోతున్న వేళ.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై
ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ విలియం అక్‌మాన్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. హిండెన్‌బర్గ్ రూపొందించిన రిపోర్ట్ అత్యంత విస్వసనీయమైనదంటూ అది చాలా లోతుగా పరిశోధించబడిందని అన్నారు. తాను అదానీ కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను చేస్తున్న కామెంట్స్ పూర్తిగా రిపోర్టు, అదానీ రెస్పాన్స్ ఆధారంగా చేస్తున్నవని చెప్పుకొచ్చారు. అసలే హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్‌లో ఉన్న ఇన్వెస్టర్లను ఈయన కామెంట్స్ ఇంకాస్త అలర్ట్ చేశాయి. దీంతో అదానీ బ్యాడ్‌ టైమ్‌ బుల్లెట్ వేగం అందుకుంది.
మరోవైపు.. వివాదం రోజురోజుకూ చిలికి చిలికి పెద్ద గాలివానగా మారుతున్న తరుణంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రీసెర్చ్ సంస్థ, ఇటు అదానీ గ్రూప్ రెండూ వెనక్కి తగ్గేటట్లు కనిపించటం లేదు. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు 19 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఆవిరైంది. అయితే ఈ పతనం ఎంత వరకు కొనసాగుతుందనే విషయం చాలా మంది ఇన్వెస్టర్లను అయోమయంలోకి నెడుతోంది. దీంతో నష్టాలకైనా అదానీ షేర్లను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపుతున్నారు. ఫలితంగా అదానీ పతనం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. అదానీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ హిందెన్ బెర్గ్ ఇచ్చిన రిపోర్టును సెబీ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో ఇచ్చిన వివరాలు అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ ఫండ్స్ బదలాయింపు వ్యవహారం దర్యాప్తులో వినియోగించుకోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అదానీ గ్రూప్ చేస్తున్న డీల్స్ వ్యవహారాలను మార్కెట్ రెగ్యులేటరీ చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అదానీ గ్రూప్ భవిష్యత్‌లో నిలదొక్కుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యమే అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...