తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్ కమింక్ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలో నివసించే సుధీర్ వర్మ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టుగా మరో నటుడు సుధాకర్ కోమాకుల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సుధాకర్.. ఆత్మహత్యకు గల కారణాలను చెప్పలేదు.
2016లో వచ్చిన కుందనపు బొమ్మ లో సుధీర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత షూటౌట్ ఎట్ ఆలేర్, సెకండ్ హ్యాండ్ సినిమాల్లో నటించాడు సుధీర్ వర్మ. కుందనపు బొమ్మలో సుధీర్ వర్మ, సుధాకర్ కోమాకుల కలిసి నటించారు. సుధీర్ ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందనీ.. తన స్నేహితుడి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ సుధాకర్ పేర్కొన్నారు.