HomeINTERNATIONAL NEWSతెగించిన ఉక్రెయిన్ : యుద్ధంలో ఊహించని పరిణామం

తెగించిన ఉక్రెయిన్ : యుద్ధంలో ఊహించని పరిణామం

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ఇప్పటి దాకా రష్యా యుద్ధం చేస్తుంటే ఉక్రెయిన్ డిఫెన్స్ మాత్రమే చేస్తోంది.. రష్యా బలగాలను అడ్డుకుని, పుతిన్ సైన్యాన్ని, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ తనను తాను రక్షించుకునేందుకు మాత్రమే ఆయుధాలను వాడింది. కానీ.. ఇఫ్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డ్రోన్లతో ఇప్పుడు ఉక్రెయిన్.. రష్యాపై దాడులు మొదలుపెట్టింది. పుతిన్ అధ్యక్ష కార్యాలయం సహా మాస్కోలోని కీలక భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో మాత్రమే కనిపించిన వార్ సీన్ ఇప్పుడు మాస్కోలోనూ కనిపిస్తోంది. అంటే యుద్ధం రష్యాలోకి ప్రవేశించిందన్నమాట. ఈ పరిణామం పూర్తి గా ఉక్రెయిన్ తెగింపుగానే అభివర్ణిస్తున్నారు మిలటరీ రంగ నిపుణులు. అంతేకాదు, యుద్ధం పీక్స్‌కు చేరే ఈ ప్రాసెస్‌లో ఎలాంటి మలుపులైనా తిరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జెలెన్‌స్కీ సేన తెగింపు అణు యుద్ధానికి దారితీయోచ్చు.. అలా జరిగితే ప్రపంచ యుద్ధంగానూ మారొచ్చన్నమాట.
సుమారు 450 రోజులు దాటిన యుద్ధంలో ఉక్రెయినే ఇప్పటిదాకా రష్యా దాడులను చవిచూస్తోంది. నాటో దేశాలు అందిస్తున్న ఆయుధ సాయంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల నుంచి తనను తాను కాపాడుకుంటూ వస్తోంది. తమ దేశం యుద్ధం చేస్తున్నా రష్యా వాసులకు ఇప్పటిదాకా దాడుల బెడదగానీ, బంకర్లలో దాక్కోవడాలు గానీ, సైరన్‌ మోతలుగానీ లేవు. కానీ రెండ్రోజులుగా ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు మాస్కోపైనా డ్రోన్ల దాడులు మొదలయ్యాయి. దీంతో యుద్ధం ఏ దిశగా సాగుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. నెలరోజుల కిందట క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి దృశ్యాలను మాస్కో రిలీజ్ చేసింది. ఉక్రెయినే ఈ పని చేసిందని ఆరోపించింది. కానీ, వాటి వాస్తవికతపై చాలామంది అనుమానాలు వ్యక్తంజేశారు. కట్‌చేస్తే.. ఆ తర్వాత మాస్కోలో పొలిటీషియన్లు, బిజినెస్ టైకూన్స్ ఉండే ప్రాంతాలపై మరోసారి 8 డ్రోన్లతో దాడులు జరగటం కలకలం రేపింది. మాస్కో పైకి 8 డ్రోన్లే అని చెబుతున్నా, అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఉక్రెయిన్‌ ఉగ్రవాదం పనేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ ఉగ్రదాడిని సమర్థిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంజేశారు.
ఉక్రెయిన్‌ మాత్రం వ్యూహాత్మకంగా ఈ దాడులను ఖండిస్తున్నా తమ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై రష్యా దాడికి ప్రతీకారంగా ఈ పని చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల్లో పాల్గొన్న యుజె-22 డ్రోన్లు కూడా ఉక్రెయిన్లో తయారైనవే కావటం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకూ సెల్ఫ్‌ డిఫెన్స్‌కు మాత్రమే పరిమితమైన ఉక్రెయిన్‌లో ఒక్కసారిగా ఈ మార్పెందుకొచ్చిందనే ప్రశ్నకు సమాధానం నాటోనే అనే వినిపిస్తోంది. యుద్ధం మొదలైననాటి నుంచీ అన్నివిధాలుగా సాయం చేస్తూ వస్తున్న నాటో దేశాలు తాజాగా ఆధునిక ఆయుధ సామగ్రిని ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. ఎఫ్‌-16 విమానాలను ఇవ్వటానికి అమెరికా లాంఛనంగా అంగీకరించింది. జర్మనీ, బ్రిటన్ల నుంచీ భారీగానే ఉక్రెయిన్‌కు వెపన్స్ వస్తున్నాయి. నాటో దేశాల నైతిక మద్దతు ఎలాగూ ఉంది. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ సేనలు రివర్స్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రష్యాను ఇబ్బంది పెట్టడానికి రెండువిధాలుగా ఎదురుదాడి మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పుతిన్‌ వ్యతిరేక బృందాలు కొన్నింటిని ఎగదోసి.. అల్లర్లు, దాడులు చేయిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల దాడులు మొదలయ్యాయి. తద్వారా ఇప్పటి దాకా యుద్ధ ప్రభావాన్ని అంతగా చూడని రష్యా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం, వారిలో పుతిన్‌ పట్ల అసంతృప్తి పెంచటం ఇందులో ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. మునుముందు రష్యాపై దాడులు పెరిగితే యుద్ధం విస్తరిస్తుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే శాంతిచర్చల దిశగా కూడా ఇది దారితీసే అవకాశం లేకపోలేదనేవారూ ఉన్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిలో మార్పు రావటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఉక్రెయిన్ దాడులతో రష్యన్ల నుంచి పీస్ డిమాండ్ వినిపించొచ్చనీ, ప్రజల ఒత్తిడికి పుతిన్‌ తలొగ్గక తప్పదనే చర్చ జరుగుతోంది.
పుతిన్ సైతం తాజా దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపైనా, నివాస భవనాలపైనా డ్రోన్ల దాడులు చేయటం ద్వారా రష్యాను భయపెట్టాలని ఉక్రెయిన్‌ భావిస్తున్నట్లుందని.. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ ఉగ్ర చర్యే అన్నారు. ఇదే సమయంలో తాము కూడా ఉక్రెయిన్‌లా స్పందించేలా రెచ్చ గొడుతున్నారన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ యాక్షన్‌ను పుతిన్ సీరియస్‌గా తీసుకుంటే ఆ దేశంపై జరిగే దాడులు మరింత భీకరంగా మారడం ఖాయం. అదే సమయంలో జెలెన్‌స్కీ తెగింపు అణుయుద్ధం దిశగా పుతిన్‌ ను ప్రేరేపించే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఈ యుద్ధం అంతకుమించి మారడం ఖాయం.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...