HomeINTERNATIONAL NEWSడేంజర్ వెపన్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రిపబ్లిక్ డే

డేంజర్ వెపన్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రిపబ్లిక్ డే

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను చాటేలా శకటాల ప్రదర్శన జరిగింది. సైనిక శక్తిని ప్రదర్శిస్తూ త్రివిధ దళాలు కవాతును నిర్వహించాయి. ఈ వేడుకలకు మొదటిసారి ఈజిప్ట్‌ అధ్యక్షుడు హాజరయ్యారు. ఆ దేశానికి చెందిన సైనిక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు పరేడ్‌లో భాగమయ్యారు. సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌‌కు చెందిన మహిళా బృందం ఈసారి వేడుకలకు ప్రధాన ఆకర్షణ. దీనికి అసిస్టెంట్ కమాండెంట్‌ పూనమ్ గుప్తా నేతృత్వం వహించారు. 29 ఏళ్ల దిశా అమృత్‌ 144 మంది యువ సైలర్లున్ననౌకాదళ కవాతు బృందానికి నేతృత్వం వహించారు. లెఫ్టినెంట్‌ చేతనాశర్మ ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థకు నాయకత్వం వహించారు.

వాయుసేన కవాతు బృందాన్ని స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధూ రెడ్డి ముందుండి నడిపించారు. మాదక ద్రవ్యాల రవాణపై పోరాడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శకటాన్ని ప్రదర్శించడం విశేషం. ఇలాంటి ఎన్నో అంశాలు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సంథింగ్ స్పెషల్ చేశాయి. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం.. దేశం మీసం తిప్పాలన్న రేంజ్‌లో ఆత్మనిర్భర్ భారత్ ఆయుధాల ప్రదర్శన జరిగింది.
ఆత్మనిర్భర్ ఆయుధాల్లో మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ గురించే. బ్రహ్మోస్ ప్రపంచంలోనే టాప్ క్లాస్ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం… ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో లక్ష్యాలవైపు దూసుకెళ్లేలా వీటిని రూపొందించారు. వందకు వంద శాతం కచ్చితత్వంతో బ్రహ్మోస్ లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్‌ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు బ్రహ్మోస్‌ కోసం భారత్‌తో డీల్స్‌ చేసుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒకప్పుడు బుల్లెట్‌ను కూడా సొంతం గా తయారు చేయలేని ఇండియానేనా ఈ మిస్సైల్‌ను రూపొందించింది అంటూ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయా యంటే బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 74వ గణతంత్ర వేడుకల్లో ఈ డెడ్లీ మిస్సైల్‌ మరో సారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

బ్రహ్మోస్ తర్వాత అంతటి శత్రుభీకర క్షిపణి అగ్ని. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో అగ్ని మిస్సైల్‌ను అభివృద్ది చేశారు. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్‌ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. అగ్ని 5 వెర్షన్ ఏకంగా 5వేల కిలోమీటర్ల నుంచి 8వేల కిలోమీటర్ల మధ్య టార్గెట్‌ ను ధ్వంసం చేసేస్తుంది. ఇటీవల తవాంగ్ ఉద్రిక్తతల సమయంలో అగ్ని 5 మిస్సైల్ టెస్టును డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. ఈ మిస్సైల్‌కు చైనాలోని బీజింగ్ సహా అన్ని నగరాలనూ కవర్ చేసే సత్తా ఉంది. దీనితోపాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్‌ మరో క్షిపణి ఆకాశ్‌ను కూడా పరేడ్‌లో ప్రదర్శించారు‌. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కిలీమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదిస్తుంది. 95శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్‌ను రూపొందించారు. ఇందుకు పాతికేళ్ల సమయం పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని కూడా విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే నాగ్ క్షిపణి కూడా పపంచాన్ని ఆకట్టుకుంది. 300 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ ఏడు కిలోమీటర్ల లక్ష్యాలపై విరుచుకుపడుతుంది.
శత్రుభీకర మిస్సైళ్లతోపాటు అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ్ హెలికాప్టర్లు, కే-9వజ్ర శతఘ్ని వ్యవస్థలు గణతంత్ర వేడుకల్లో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నాయి. నిజానికి.. ఇండియన్ ఆర్మీకి అర్జున్‌ యుద్ధ ట్యాంకు చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. దేశ సరిహద్దుల్ని కాపుకాయడంలో అర్జున్‌ని మించిన నమ్మకమైన యుద్ధ ట్యాంకులు మరొకటి ఉండవేమో. 2011లో అర్జున్ ట్యాంక్ మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్‌ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా క్షణాల్లో కూల్చే సత్తా ప్రచండ్ సొంతం. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు.
కే-9 వజ్ర.. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం వీటిని లఢఖ్‌ సరిహద్దుల్లో మోహరించారు. 155ఎంఎం కెనాన్‌ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కిలోమీటర్ల దూరం వరకూ గుళ్ల వర్షం కురిపించొచ్చు. దీనికున్న అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ గంటకి 67 కిలోమీటర్ల వేగంతో పని చేస్తుంది. అవదుకే వీటిని చైనాపై గురి పెట్టి ఉంచారు. అయితే, ఇప్పటివరకూ చెప్పినవన్నీ ఇంతకుముందే ఆర్మీ చేతికి అందిన ఆయుధాలు.. కానీ, గణతంత్ర దినోత్సవం సాక్షిగా అంతకుమించిన అస్త్రం ఇంకొకటుంది. అదే వరుణ్ డ్రోన్.! గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ డ్రోన్ ప్రయోగం జరిగింది. ‘వరుణ్’ డ్రోన్‌ను మహారాష్ట్రకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ పేలోడ్ కెపాసిటీ 130 కిలోలు. ఒక వ్యక్తిని మోసుకెళ్లే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది. ఇది 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒక్కసారి ప్రయాణం స్టార్ట్ చేస్తే 25 నుంచి 33 నిమిషాల పాటు గాల్లో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో నేవీలో కూడా దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64శాతం నిధులు స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే.. 2021లో 68శాతం నిధులను వినియోగించాయి. ఆర్మీ ప్రస్తుతం అత్యధికంగా 72శాతం నిధులను మేడిన్‌ ఇండియా ఆయుధాలపైనే వెచ్చిస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2వేల 500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిగా ఆత్మనిర్భర్ ఆయుధాలనే ప్రదర్శించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించే దే. భవిష్యత్‌లో ఆయుధాల ఎగుమతులు సైతం పెరిగేందుకు తాజా యాక్షన్ భారత్‌కు కలిసొస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...