వస్తువులను దొంగతనంగా దేశ సరిహద్దులు దాటించటానికి నానా తిప్పలు పడే స్మగ్లర్లు.. ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతూనే ఉంటారు. బంగారం, వజ్రాలు.. ఇలా విలువైన వస్తువులను దాచటానికి చిత్ర విచిత్రమైన దారులు వెతికే స్మగ్లర్లు.. కరెన్సీ నోట్లను దాచటానికి ఈ సారి గుట్కా ప్యాకెట్లను ఎంచుకున్నారు. డాలర్ నోట్లను చిన్నగా మడిచి.. గుట్కా ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కోల్ కతా లో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. కోల్ కతా నుంచి బ్యాంకాంక్ వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. ప్యాకెట్లను చూసి అనుమానం వచ్చిన అధికారులు వాటిని తెరిచి చూస్తే ఒక్కో ప్యాకెట్లో డాలర్ నోట్లు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.