HomeTELANGANAజయలళిత పార్టీ ఎవరిదో తేేల్చేసిన సుప్రీంకోర్టు

జయలళిత పార్టీ ఎవరిదో తేేల్చేసిన సుప్రీంకోర్టు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

జయలలిత మరణం తర్వాత రెండాకుల పార్టీలో మొదలైన ఆధిపత్య పోరుకు దేశ అత్యున్నత ధర్మాసనం ఎండ్ కార్డ్‌ వేసింది. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే అని తేల్చేసింది. ఈ పరిణామంతో డీలా పడిపోయిన పన్నీర్ వాట్ నెక్స్ట్ అనేదానిపై కిందా మీదా పడుతున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు మావే అంటే మావే అంటూ రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత జులై 11న సమావేశం నిర్వహించారు. అందులో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. ఆ సమావేశంలో 23 తీర్మానాలు ఏకపక్షంగా తీర్మానించేడం ద్వారా అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామి చేతి లోనే ఉన్నాయనే సందేశం ఇచ్చారు. కట్‌చేస్తే.. పన్నీర్ సెల్వం వర్గం మద్రాస్ హైకోర్ట్ మెట్లెక్కింది.
గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్‌ 23కి ముందు పరిస్థితే ఉంటుందని గతేడాది ఆగస్ట్‌లో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌ తీర్పునిచ్చారు. అయితే, దీనిపై పళనిస్వామి మద్రాసు హైకోర్టులో అప్పీలు చేయగా.. జస్టిస్‌ జయచంద్రన్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఇదే టైంలో జులై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని పేర్కొంటూ.. జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ తీర్పును పన్నీర్‌ సెల్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పన్నీర్ సెల్వం పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే చెందినట్లైంది. సుప్రీం తీర్పుతో పళని వర్గం శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఈ పరిణామంతో త్వరలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించి.. పళని స్వామిని పూర్తిస్థాయిలో అధినాయకుడిగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ దిగ్గజాలు, దివంగత సీఎంలు ఎంజీ రామచంద్రన్​, జయలలిత ఆశీస్సులతో తమకు అనుకూలమైన తీర్పు వచ్చిందని చెప్పారు. సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న పళని స్వామి తన ప్రత్యర్థి పన్నీరుసెల్వంపై విమర్శలు గుప్పించారు.. డీఎంకేలో బీ టీమ్‌గా పనిచేసి, అన్నాడీఎంకేను అంతం చేయాలని కోరుకున్న కొంతమంది ద్రోహులకు ఈ రోజు కళ్లు తెరుచుకున్నాయని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకేకు భవిష్యత్‌ లేదన్నదారు అందరికీ సుప్రీంకోర్టు, హైకోర్ట్ తీర్పులతో మంచి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. నిజానికి.. పళని స్వామిని పక్కకుపెట్టి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలని కలలు కన్న పన్నీర్‌కు కాలం కూడా కలిసొస్తున్నట్టు లేదు. సుప్రీం కోర్ట్‌ తీర్పునకు ముందే పన్నీర్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఎక్కువ మంది నిర్వాహకులు, జిల్లా కార్యదర్శుల మద్దతుతో అన్నాడీఎంకే దాదాపు పూర్తిగా పళని ఆధీనం లోకి వెళ్లడానికి మరో కారణం మెజారిటీనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈరోడ్ తూర్పు ఉపఎన్నికల్లో అయినా పళనికి చెక్‌ పెట్టాలని భావించిన పన్నీర్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ ఉపఎన్నికల్లో ఇరు వర్గాలూ అభ్యర్థులను ప్రకటించగా..తాజా సుప్రీంకోర్టు జోక్యంతో ఎడప్పాడి పళనిస్వామి తరఫు అభ్యర్థి కేఎస్‌ తెన్నరసు అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థి అయ్యారు. అదే సమయంలో రెండాకుల గుర్తు కూడా పళని స్వామి వర్గం సొంతమైంది.
ఈ క్రమంలోనే పన్నీర్‌ తరఫు అభ్యర్థి సెంథిల్‌ మురుగన్‌ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ముందుగా పన్నీర్ మద్దతు కలిగిన ఈరోడ్ జిల్లా కార్యదర్శి మురుగానందం పోటీ చేయాలని భావించారు. పన్నీర్‌ మాత్రం సెంథిల్‌ మురుగన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీతో సంబంధంలేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించటమే కాకుండా పోటీ నుంచి వైదొలగడం మురుగానందం, ఆయన అనుచరులకు అసంతృప్తి కలిగించింది. ఇంకా నిర్వాహకులు ఏమీ మాట్లాడొద్దని పన్నీర్‌ సెల్వం నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. డీఎంకేను కూడా విమర్శించొద్దంటే ఎలాగని పన్నీర్ సెల్వం తరఫు నిర్వాహకులు తీవ్ర అంతృప్తికి లోనైనట్లు సమాచారం. దీంలో మురుగానందం సహా 106 మంది పన్నీర్‌సెల్వం నిర్వాహకులు పన్నీర్‌ వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇది పన్నీర్‌కు వెనుకంజగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మొత్తంగా.. సుప్రీంకోర్ట్ తీర్పుతో అన్నాడీఎంకే పగ్గాలపై పన్నీర్ సెల్వం ఆశలు వదిలేసు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఈరోడ్‌లో సత్తా చాటాలన్న ప్లానూ బెడిసికొట్టింది. వీటన్నింటికీతోడు తనవర్గం నుంచి మూకుమ్మడి రాజీనామాలు సైతం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. దీంతో అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం రాజకీయ పాత్ర ఆల్మోస్ట్ కనుమరుగైపోయినట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో డీఎంకేలో చేరదామనుకున్నా.. డీఎంకేకు పన్నీర్ బీటీమ్ అని ముందునుంచీ పళని వర్గం చేస్తున్న ఆరోపణలను నిజం అయ్యాయనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అన్నాడీఎంకేలో ఉండే పరిస్థితి లేక, డీఎంకేతో కలిసి నడిచే ఛాన్స్‌ లేక పన్నీర్ సైలెంట్‌గా ఉండిపోక తప్పేలా కనిపించడంలేదు. తమిళనాడుకు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం అంటే సాధారణ విషయం కానేకాదు. మరి పన్నీర్ సెల్వం తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారో ముగిస్తారో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...