కాంగ్రెస్ పై మోడీ కొత్త వెపన్.. జైశంకర్

జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు చేసుకుంటున్నా, అంతర్జాతీయ వేదికలపై శత్రు దేశాలకు చెక్ పెడుతున్నా.. వాటి వెనుకుంది ఈయనే. ఐతే, ఎప్పుడూ దేశం బయట రాజకీయ వ్యూహాలు పన్నడంలో బిజీగా ఉండే జైశంకర్.. తాజాగా దేశ రాజకీయాల్లోనూ తన మార్క్ యాక్షన్ షురూ చేస్తున్నారు. గతంలో చైనాతో ఉద్రిక్తతలు, తాజాగా జార్జ్‌ సోరోస్ విమర్శలు లాంటి అంశాలను అస్త్రంగా చేసుకుంటున్న ప్రత్యర్ధులపై పవర్ పంచ్‌లు పేల్చుతున్నారు. ఈ క్రమంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీపై జైశంకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
విదేశాంగ మంత్రి జైశంకర్‌ గతంలో ఎన్నడూ చూడనంతగా దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. వీలుచిక్కిన ప్రతిసారీ ప్రత్యర్ధులను కార్నర్ చేసేలా పంచ్‌లు పేల్చుతున్నారు తాజాగా గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఇరుకునపెట్టేలా “మీ వైఖరి తీసేసేది ఐతే.. మోడీ సర్కార్‌ విధానం చేర్చుకునేది అంటూ సంచలన కామెంట్లు చేశారు.ఇవీ కాంగ్రెస్‌పై విదేశాంగ మంత్రి చేసిన విమర్శలు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి కె.సుబ్రహ్మణ్యంను కేంద్ర కార్యదర్శిగా తొలగించారని జైశంకర్ అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో తన తండ్రిని క్యాబినెట్ సెక్రటరీ పదవికి తన కంటే జూనియర్ ఎవరో నియమించారని విదేశాంగ మంత్రి తెలిపారు. కె.సుబ్రహ్మణ్యం 1980లో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారు. 1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తొలగించిన మొదటి కార్యదర్శి ఆయనే అని జైశంకర్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇదే సమయంలో ప్రధాని మోడీ తనను కేబినెట్‌తో ఆహ్వానించడాన్ని కూడా గుర్తు చేశారు. మోడీ లాంటి పర్ఫెక్ట్ లీడర్‌ను తానిప్పటివరకూ చూడలేదన్నారు. జైశంకర్ తాన వ్యాఖ్యలతో చెప్పాలనుకుంది ఒక్కటే. నిజాయితీపరులను, టాలెంట్ ఉన్నవారిని కాంగ్రెస్ దూరం చేస్తే.. మోడీ మాత్రం ప్రతిభను వెదికిమరీ అవకాశాలిచ్చరని చెప్పడమే. అయితే, ఇవే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మంటతెప్పించాయి. ఫలితంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ మీడియా ముందుకొచ్చారు. వస్తూ వస్తూనే ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌పై విరుచుకుపడ్డారు. జైశంకర్‌ను అయితే ఫెయిల్యూర్ మంత్రిగా అభివర్ణించారు.కాంగ్రెస్ మాత్రమే కాదు బీజేపీ సర్కార్‌ను పదే పదే విమర్శిస్తున్న టీఎంసీ సైతం జైశంకర్‌పై విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఎంపీ జవహర్ సిర్కార్‌ ప్రధాని మోడీని అసురతో పోల్చారు. జైశంకర్‌ తండ్రికే సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోడీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జైశంకర్‌ తండ్రి కే.సుబ్రమణ్యం గుజరాత్‌ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోడీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్‌ మండిపడ్డారు. నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి.. గాంధీలపై ఉన్న అక్కసును మరోసారి జైశంకర్‌ బయటపెట్టుకున్నారని జవహర్ సిర్కార్ మండిపడ్డారు. ఈ పొలిటికల్ విమర్శలను పక్కనపెడితే.. విపక్షాలపై ఎదురుదాడికి జైశంకర్‌ను రంగంలోకి దించడానికి రీజన్ లేకపోలేదు. ఇటీవలికాలంలో దేశ రాజకీయాలు మొత్తం అదానీ, హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్, చైనా, పాకిస్తాన్ సరిహద్దు వివాదాలతోపాటూ గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ చుట్టే తిరుగుతున్నాయి. గతేడాది తవాంగ్‌ ఉద్రిక్తతల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్‌తో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులున్నాయనీ.. చైనా మన భూభాగాన్నీ కబ్జా చేస్తుంటే మోడీ సర్కార్ చూస్తూ కూర్చుందని ఆరోపించారు. ఆ తర్వాత అదానీ వ్యవహారంపైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాల్సిందే అని డిమాండ్ చేశారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీపైనా మోడీ నోరువిప్పాలని పట్టుబడుతున్నారు. ఓరకంగా వీటన్నింటికీ ఇతర మంత్రులకంటే విదేశాంగ మంత్రి సమాధానం చెబితేనే లెక్క సరిపోతుందని మోడీ సర్కార్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జైశంకర్‌ను రెచ్చిపొమ్మంటున్నారనే చర్చఈ క్రమంలోనే సందర్భం ఎలాంటిదైనా.. చైనాతో విబేధాల దగ్గర నుంచి ప్రధాని మోడీపై నోరు పారేసుకున్న జార్జ్‌ సోరోస్ వరకూ ప్రతి అంశాన్నీ విదేశాంగ మంత్రి టచ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయాలంటే దేశంలోని పార్టీల మధ్యే కాదనీ, ఫారిన్‌ నుంచి కూడా జరుగుతాయని వ్యాఖ్యానించడం వెనుక రీజన్ కూడా అదే అంటున్నారు విశ్లేషకులు. తద్వారా భారత్‌పై విదేశీ శక్తుల కుట్రలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. ఏదేమైనా కంట్రీ పాలిటిక్స్‌లో జైశంకర్ మార్క్‌ యాక్షన్‌తో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయినట్టే కనిపిస్తోంది.