HomeINTERNATIONAL NEWSఅమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్ : షాకింగ్ నిజాలు

అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్ : షాకింగ్ నిజాలు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

అమెరికాను ఓ డ్రగ్ వణికిస్తోంది.. జనాలను జాంబీలుగా మార్చేసి.. రోడ్లపై ఎక్కడి వాళ్ళు అక్కడే కూలబడిపోయేట్టు చేస్తోంది. అదే.. జాంబీ డ్రగ్. ఇదో రకమైన మత్తుపదార్థం. ప్రస్తుతం అగ్రరాజ్యం తలపట్టుకునేలా చేసిన డేంజర్ డ్రగ్. దీని పేరు జిలాజైనే అయినా దీనికున్న మారుపేర్లు మాత్రం అనేకం. ఐతే, అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న డెడ్లీ డ్రగ్ ఎక్కడి నుంచొస్తుంది? దీనికి అమెరికన్లు ఎలా బానిసలవుతున్నారు? ఒక్కసారి దీనికి అడిక్ట్‌ అయితే బతికిబట్టకట్టడం కష్టమేనా?
ఇవేం హాలీవుడ్ మూవీస్‌లో కనిపించే జాంబీలు కాదు. రియల్ లైఫ్‌లో ఏం చేస్తున్నామో కూడా తెలీనంతగా ప్రవర్తిస్తున్న రియల్ జాంబీలు. కాకపోతే సినిమాల్లోలా మనుషుల్ని పీక్కుతినే టైప్ కాదంతే. అలా అని రిలాక్స్ అవ్వడానికి కూడా లేదట. అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలా మారిపోడానికి కారణం ఓ డర్టీ డ్రగ్. దాని అసలుపేరు జిలాజైన్. దీన్నే ట్రాంక్ అనీ, ట్రాంక్ డోప్ అనీ, జాంబీ డ్రగ్ అనీ పిలుస్తున్నారు.
గతంలో ఈ డ్రగ్‌ను మాదక ద్రవ్యాలు తీసుకునేవారికి ట్రీట్మెంట్‌లో భాగంగా ఇచ్చేవారు. అయితే దీని వల్ల పలు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. జిలాజైన్‌ను తీసుకున్నవారు తీవ్ర నిద్రమత్తులో జోగుతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఈ డ్రగ్‌ను తరచూ తీసుకుంటే చర్మం కుళ్లిపోయే దశకు చేరుకుంటుంది. దీన్ని వాడుతూ ఉండటం వల్ల అల్సర్ మొదలవుతుంది. దీనివల్ల ప్రభావితమైన భాగాన్ని తొలగించాల్సి రావొచ్చు. ఇది ఓవర్‌ డోస్ అయితే.. మరణం సంభవించే అవకాశాలే ఎక్కువ. చికిత్సతో సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్ మొదట ఫిలడెల్ఫియాలో కనిపించగా.. తర్వాత కాలంలో శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలెస్‌కు పాకింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ డ్రగ్‌ను ఆమోదించింది. అయితే, మనుషుల కోసం కాదు, పశువైద్యం కోసం మాత్రమే. ఈ డ్రగ్ అతి వినియోగం వల్ల 2021లో దాదాపు 2వేల 5వందల మంది న్యూయార్క్ వాసులు మృతి చెందినట్లు న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అమెరికా మొత్తంమీద ఆ సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది.
అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం రేపింది మొదట ఫిలడెల్ఫియా నగరంలో. గతేడాది దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ నగరంలో ఈ డ్రగ్ విక్రయాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ఫలితంగా ఈ వ్యవహారం ముగిసిందనుకున్నారు. కానీ ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌ లాంటి మహా నగరాలకు కూడా ఈ డ్రగ్ పాకడం కలవర పెడుతోంది. ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ లాంటి కాస్టిలీ మాదక ద్రవ్యాలకు బదులుగా చీప్‌గా దొరుకున్న ఈ డర్టీ డ్రగ్‌ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ డ్రగ్‌ను ఓవర్‌ డోస్‌ తీసుకొన్న వారికి రివర్స్‌ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు కూడా స్పందించదని నిపుణులు చెబుతున్నారు. అధిక మోతాదులో దీన్ని తీసుకోవడం అంటే మరణానికి వెల్‌కమ్ చెప్పడంతో సమానమంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో డ్రగ్ మాఫియాలకు కొదవుండదు. ఇందుకే ఈ డ్రగ్‌ అమెరికా వీధుల్లో విచ్చలవిడిగా సామాన్యుల చేతికి చిక్కుతోంది. నిత్యం డ్రగ్స్ మత్తులో తూగేవారిని టార్గెట్ చేసుకుంటున్న మాఫియా.. చాక్లెట్లు అందించినంత ఈజీగా, అతితక్కువ ధరకే జిలాజైన్‌ను విక్రయిస్తోంది. దీంతో ఈ డ్రగ్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇదే జరిగితే హాలీవుడ్ సినిమాల్లో కనిపించే భయంకరమైన పరిస్థితులే అమెరికా వీధుల్లోనూ కనిపించే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఏదేమైనా జాంబీ డ్రగ్ విక్రయాలను అదుపుచేయకపోతే మాత్రం రిజల్ట్ అత్యంత దారుణంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై బైడెన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...